వెబ్ సిరీస్‌లో జాన్వీ కపూర్.. అలాంటి కథలతో న్యూ ఇయర్‌కు స్పెషల్ ట్రీట్
అందాల తార స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. వెండితెరపై గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి మెరుస్తోన్న సంగతి తెలిసిందే. మరాఠీ హిట్ చిత్రం సైరాట్ రీమేక్‌తో బాలీవుడ్‌ను పలకరించింది. ఢడక్ అంటూ ప్రేక్షకులను అలరించిన జాన్వీ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తూ ఉంటుంది.

ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి..
చేసింది ఒక్క చిత్రమే అయినా.. స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది. శ్రీదేవీ, బోనీ కపూర్ కూతురు కావడంతో ఇటు దక్షిణాదిన, అటు ఉత్తరాదిన ఫుల్ క్రేజ్ ఏర్పడింది. నిత్యం వ్యాయామం అంటూ జిమ్‌లో కష్ట పడుతున్న వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. జిమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు క్లిక్‌మనిపించే ఫోటోలు ఎంతగా వైరల్ అవుతుంటాయో ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు.

ఎప్పుడూ నాన్న వెంటే..
బయటకు వెళ్లిన ప్రతీసారి తండ్రి బోనీ కపూర్ వెంటే ఉంటుంది. ఏ ఈవెంట్‌లో పాల్గొన్నా నాన్న చేతిని పట్టుకునే నడుస్తుంది. జాతియ అవార్డుల వేడుకులో తండ్రిని ఎంత జాగ్రత్తగా చూసుకుందో అందరికీ తెలిసిందే.
వెబ్ సిరీస్‌ల హవా..
ప్రస్తుతం భాషాబేధం లేకుండా అన్ని చోట్లా వెబ్ సిరీస్‌ల హవా కొనసాగుతోంది. ఉత్తరాదిన అయితే వీటి హడావిడి మరీ ఎక్కువైంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లో మితిమీరిన అడల్డ్ కంటెంట్‌ను జొప్పించి ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. వెండితెరకు సమాంతరంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ వెబ్ సిరీస్‌లు ఎదుగుతున్నాయి. పెద్ద పెద్ద స్టార్లు వీటిలో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నారు.
Recommended Video

భయపెట్టేందుకు వస్తోన్న జాన్వీ
హారర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్న సంగతి తెలిసిందే. దెయ్యాల కథ అన్నది ఎప్పుడూ హిట్ ఫార్మూలానే. ఘోస్ట్ స్టోరీస్ అంటూ భయపెట్టేందుకు వస్తోన్నట్టు జాన్వీ కపూర్ తెలిపింది. కొత్త ఏడాది ప్రారంభంలో వెన్నులో వణుకు పుట్టించేందుకు వస్తోన్నట్లు ప్రకటించింది. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లానే.. నాలుగు విభిన్న కథలతో ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











