ముసలి హీరోలతో నటించాలా? ఆ ముగ్గురితో నటించను.. తేల్చి చెప్పిన జాన్వీ కపూర్
దేశం గర్వించదగిన శ్రీదేవీ కూతురిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ఊహించినట్టు తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకోలేక సతమతమవుతున్నది. ఆమె నటించిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకుల మన్ననలు అందుకోలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాన్వీ కపూర్ కెరీర్ గ్రాఫ్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే తాజాగా ఆమె నటించిన గుడ్ లక్ జెర్సీ సినిమా ప్రమోషన్‌లో బాలీవుడ్ అగ్రహీరోలపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యాయి. ఆ వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

కెరీర్ గ్రాఫ్ ఊగిసలాట
జాన్వీ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. ధడక్ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆమె నటించిన గుంజన్ సక్సెనా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన రూహీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఆమె నటించిన గుడ్ లక్ జెర్నీ సినిమా డిస్నీ+హాట్ స్టార్‌లో ప్రసారం అవుతున్నది.

నయనతార సినిమా రీమేక్‌లో
గుడ్ లక్ జెర్నీ సినిమా విషయానికి వస్తే.. తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో దర్శకుడు నెల్సన్ కుమార్ రూపొందించిన కొలమావు కోకిల సినిమా ఆధారంగా తెరకెక్కింది. అయితే ఆ చిత్రాన్ని రీమేక్ చేయడంలో దర్శకుడు తడబాటుకు గురయ్యాడు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నది.

షారుక్, సల్మాన్, అమీర్‌తో నటిస్తావా?
ఇక గుడ్ లక్ జెర్నీ సినిమా రిలీజ్‌కు ముందు జాన్వీ కపూర్ ముంబై మీడియాతో మాట్లాడింది. తాజా ఇంటర్యూలో షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్‌తో నటిస్తావా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. వారితో నటించడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది.

ఏజ్ గ్యాప్ హీరోలతో కష్టం
అయితే సల్మాన్ ఖాన్, అమీర్, షారుక్ ఖాన్ చాలా సీనియర్ నటులు. వారితో నటించడం సమంజసంగా ఉండదు. వారి వయసు, నా వయసుకు చాలా గ్యాప్ ఉంటుంది. అలా వయోభేదం ఎక్కువగా ఉన్న వారితో నటిస్తే.. ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం కష్టమే అని జాన్వీ కపూర్ అభిప్రాయపడింది. అయితే తెలుగులో ఎన్టీఆర్‌తో నటించడం నా డ్రీమ్. అలాగే వరుణ్ ధావన్, రణ్‌బీర్ కపూర్ అని చెప్పింది.

రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న గురించి
తాజాగా గుడ్ లక్ జెర్రీ సినిమాకు ముందు కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో పాల్గొన్నది. అయితే బాలీవుడ్‌లో వివాహితులైన హీరోల్లో రణ్‌బీర్ కపూర్ చాలా శృంగారపురుషుడిగా కనిపిస్తాడని చెప్పింది. ఇక ఇన్స్‌టాగ్రామ్‌లో రష్మిక మందన్న ఫాలోవర్స్ భారీగా పెరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











