‘అర్జున్ రెడ్డి’కి షాకిచ్చిన జాహ్నవి కపూర్.. అతడి కారణంగానే!

By Rajababu

Recommended Video

Janhvi Kapoor Rejects Arjun Reddy Remake Offer

అర్జున్‌రెడ్డి రీమేక్‌లో దివంగత అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నటించబోతున్నట్టు బాలీవుడ్ పత్రికలు కోడైకూసాయి. ఈ చిత్రంలో జాహ్నవితో నటింప జేసేందుకు చిత్ర నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరిపారు. అయితే చివరి నిమిషంలో హిందీ అర్జున్ రెడ్డి నుంచి జాహ్నవి తప్పుకోవడం, ఆమె తప్పుకోవడానికి ప్రముఖ దర్శక, నిర్మాత కారణమని ఓ వార్త వినిపించడం వివాదంగా మారింది. ఇంతకు ఆ దర్శకుడు ఎవరంటే..

అర్జున్‌రెడ్డికి నో చెప్పిన జాహ్నవి

అర్జున్‌రెడ్డికి నో చెప్పిన జాహ్నవి

తెలుగు ఘన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రాన్ని హిందీలో షాహీద్ కపూర్‌తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం జాహ్నవి అయితే బాగుంటుందని నిర్మాతలు అనుకొన్నారు. కానీ ఈ చిత్రంలో ఆమె నో చెప్పడానికి కారణం కరణ్ జోహర్ అని తెలిసింది.

కరణ్ జోహర్ వద్దన్నందుకే

కరణ్ జోహర్ వద్దన్నందుకే

అర్జున్ రెడ్డి లాంటి మసాలా చిత్రంలో జాహ్నవి నటించకుండా కరణ్ జోహర్ అడ్డుకొన్నారు అని బాలీవుడ్ పత్రికల కథనం. కెరీర్ ఆరంభంలో ఉన్నందున అర్జున్‌రెడ్డి లాంటి చిత్రాల్లో కాకుండా ధడక్ లాంటి సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేయమని కరణ్ సూచించడట. అంతేకాకుండా ఈ చిత్రంలో తారా సుతారియాను తీసుకొమని సలహా ఇవ్వడంతో ఆమెను ఎంపిక చేసినట్టు తెలిసింది.

షాహిద్ కపూర్ హ్యాపీ

షాహిద్ కపూర్ హ్యాపీ

అర్జున్‌రెడ్డి రీమేక్‌పై హీరో షాహిద్ కపూర్ స్పందిస్తూ.. ఇది నాకు ఫస్ట్ రీమేక్ చిత్రం. అందుకే కొంత ఎక్సైటింగ్‌గా, కొంత హ్యాపీగా ఉంది. అర్జున్ రెడ్డి సినిమా ఇప్పటికే చూశాను. విజయ్ దేవరకొండ, షాలిని పాండే పాత్రలంటే చాలా ఇష్టం కలిగింది. హిందీలో ఘనవిజయం సాధించేలా మేము కృషి చేస్తాం అని అన్నారు.

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌కు కూడా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో సంచలన విజయం సాధించిన చిత్రాన్ని తమిళంలో వర్మ పేరుతో విక్రమ్ తనయుడు ధ్రువ్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X