»   » మూడ్ బట్టి మనిషిని మార్చేస్తా, నా పెళ్లి అక్కడే: జాహ్నవి కపూర్

మూడ్ బట్టి మనిషిని మార్చేస్తా, నా పెళ్లి అక్కడే: జాహ్నవి కపూర్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Janhvi Kapoor Revealed About Her Crush

  అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాహ్నవి కపూర్... చేసింది కేవలం ఒకే సినిమా అయినా వచ్చిన గుర్తింపు మాత్రం అంతకంటే ఎక్కువే. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ 'ధడక్' బ్యూటీ కరణ్ జోహార్ పీరియడ్ డ్రామా 'తక్త్'లో అవకాశం దక్కించుకోవడం ద్వారా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. దీంతో పాటు తరచూ ఫోటో షూట్లు, ఫ్యాషన్ మేగజైన్ కవర్ పేజీలపై అందాల ఆరబోతతో జాహ్నవి గ్లామర్ ప్రపంచంలో అందం పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఓ మేగజైన్ ఇంటర్వ్యూలో జాహ్నవి పలు ఆస్తికర విషయాలు వెల్లడించారు.

  అక్కనే మించిపోయిన చెల్లి.. రెచ్చిపోయిన శ్రీదేవి కూతురు!

   క్రష్ ఎవరిపై?

  క్రష్ ఎవరిపై?

  ‘బ్రైడ్' అనే మేగజైన్ అక్టోబర్ సంచికలో జాహ్నవి ఇంటర్వ్యూ ప్రచురితమైంది. మీకు ఎవరిపై క్రష్ (కోరిక) ఉంది అని అడిగిన ప్రశ్నకు ఈ 21 ఏళ్ల బ్యూటీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అది తరచూ మారుతూ ఉంటుందని, తన మూడ్ బట్టి ఒక్కోసారి ఒక్కో వ్యక్తిపై క్రష్ ఏర్పడుతుంది అంటూ జాహ్నవి సమాధానం ఇచ్చారు.

   ఒక్కోసారి అతడు, మరోసారి ఇతడు కూడా...

  ఒక్కోసారి అతడు, మరోసారి ఇతడు కూడా...

  కొన్ని సార్లు నాకు హాలీవుడ్ యాక్టర్ మాట్ డామన్ మీద కోరిక కలుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బాలీవుడ్ సినీయర్ యాక్టర్ గురు దత్ సినిమాలు చూసినపుడు కూడా అతడిపై క్రష్ ఏర్పడుతుంది అంటూ జాహ్నవి సమాధానం ఇచ్చారు.

  గాసిప్స్ రాకుండా జాహ్నవి తెలివిగా సమాధానం చెప్పిందా?

  గాసిప్స్ రాకుండా జాహ్నవి తెలివిగా సమాధానం చెప్పిందా?

  ‘క్రష్' అనే ప్రశ్న ఎదురైనపుడు జాహ్నవి చెప్పిన సమాధానాలు చూస్తుంటే చాలా తెలివిగా స్పందించినట్లు స్పష్టం అవుతోంది. యంగ్ యాక్టర్ల పేరుతో చెబితే తనపై లేని పోని గాసిప్స్ వచ్చే అవకాశం ఉండటంతో కావాలనే 47 ఏళ్ల హాలీవుడ్ యాక్టర్ పేరు, మొన్నటి తరం బాలీవుడ్ స్టార్ గురు దత్ పేరు చెప్పినట్లు స్పష్టమవుతోంది.

   అక్కడే పెళ్లి చేసుకోవాలని ఉంది

  అక్కడే పెళ్లి చేసుకోవాలని ఉంది

  ఒక వేళ మీరు పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఏ ప్రదేశాన్ని ఇష్టపడతారు అని అడగ్గా.... ‘కొన్ని సంవత్సరాల క్రితం ఇటలీలోని ఫ్లోరెన్స్ సిటీకి వెళ్లినపుడు... పెళ్లంటూ చేసుకుంటే ఇక్కడే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికీ నా మనసులో అదే ఉంది. పెళ్లి సమయంలో గోల్డ్ జరీతో ఉన్న కాంజీవరం చీర ధరించాలని ఉంది' అని జాహ్నవి తెలిపారు.

   జాహ్నవి సినిమాలు

  జాహ్నవి సినిమాలు

  ‘ధడక్' సినిమా తర్వాత జాహ్నవి... కరణ్ జోహార్ తెరకెక్కించే పీరియడ్ డ్రామా ‘తక్త్'లో అవకాశం దక్కించుకుంది. ఇందులో కరీనా కపూర్, రణవీర్ సింగ్, అలియా భట్, అనిల్ కపూర్, భూమి పడ్నేకర్, విక్కీ కౌశల్ తదితరులు నటిస్తున్నారు. 2020లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

  English summary
  Janhvi Kapooris on the cover of the October issue of Brides Today. In an exclusive interview, Janhvi revealed who she had a crush on."Keeps changing, depending on my mood, sometimes I like Matt Damon from The Bourne Identity and at other times, it could even be Guru Dutt from one of his iconic films," she told Brides Today editor Nupur Mehta Puri.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more