twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నచ్చితే చెప్పు, పెళ్లి చేస్తాం.. ఇలా పిచ్చి వేషాలు వేయొద్దు.. అమ్మా నాన్న వార్నింగ్!

    |

    అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గత ఏడాది దఢక్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి కుమార్తె కావడంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టకముందే బాగా పాపులర్ అయింది. సినిమాల్లోకి రాకముందు జాన్వీ గురించి అనేక గుసగుసలు వినిపించేవి. తాజాగా జాన్వీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ గురించి వస్తున్న వార్తలపై స్పందించింది. ఆ సమయంలో శ్రీదేవి, బోణి కపూర్ జాన్వికి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారట.

    జాన్వీ బాయ్ ఫ్రెండ్స్ జాబితా

    జాన్వీ బాయ్ ఫ్రెండ్స్ జాబితా

    జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్స్ జాబితాలో చాలా మంది సెలెబ్రిటీల పేర్లు వినిపించాయి. ఇషాన్ ఖట్టర్, శిఖర్ పహారియా, అక్షత్ రాజన్ ఇలా చాలా మందితో జాన్వీ కపూర్ రొమాన్స్ సాగించినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని ప్రయివేట్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అప్పట్లో జాన్వీ జోరు చూసి బాలీవుడ్ ప్రముఖులంతా ఆశ్చర్యపోయారు.

    ఇంట్లో క్లాస్ పీకారు

    ఇంట్లో క్లాస్ పీకారు

    గతంలో తన గురించి వచ్చిన రూమర్స్ పై జాన్వీ కపూర్ నోరు విప్పింది. నా గురించి వస్తున్న వార్తలు విని మా అమ్మా నాన్న కూడా నిజమనుకున్నారు. ఒక రోజు అమ్మ నాన్న నన్ను పిలిచి.. ఎవరైనా నచ్చితే మాతో చెప్పు.. పెళ్లి చేస్తాం.. అంతేకాని ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేయవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. నా స్నేహితులతో సరదాగా ఉండడం చూసి అంతా తప్పుగా అర్థం చేసుకున్నారు అని జాన్వీ తెలిపింది.

    అందరిని పెళ్లి చేసుకోలేను

    అందరిని పెళ్లి చేసుకోలేను

    నాకు ఇష్టమైన స్నేహితులు చాలా మంది ఉన్నారు. ఇష్టపడడం వేరు, ప్రేమించడం వేరు. నేను ఇష్టపడిన ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకోలేను. వాళ్లంతా నా స్నేహితులు కాబట్టి కలసి సరదాగా తిరిగాను. అందులో తప్పేముంది అంటూ జాన్వీ వ్యాఖ్యానించింది. దాని ఆధారంగా నేనెవరితోనే డేటింగ్ లో ఉన్నట్లు, ప్రేమలో ఉన్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయని జాన్వీ తెలిపింది.

    భయపడుతున్నారు

    భయపడుతున్నారు

    ఇలాంటి రూమర్స్ వస్తుండడంతో నా స్నేహితులంతా భయపడుతున్నారు. నాతో కలసి పార్టీకి కూడా రావడం లేదు. ఇలాంటి వార్తలే అందుకు కారణం అని జాన్వీ తెలిపింది. సరదాగా గడపడానికి, డేటింగ్ చేయడానికి తేడా ఉందని జాన్వీ తెలిపింది. దఢక్ చిత్రంతో నటిగా మంచి మార్కులు సొంతం చేసుకున్న జాన్వీ ప్రస్తుతం రెండో చిత్రానికి సిద్ధం అవుతోంది. గుంజన్ సక్సేనా బయోపిక్ లో జాన్వీ కపూర్ నటించబోతోంది.

    English summary
    Janhvi Kapoor reveals Sridevi and Boney Kapoor were dramatic about her dating life Janhvi Kapoor revealed that dating has always been a situation at home and her parents have been quite dramatic about it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X