మా అమ్మ నన్ను నమ్మేది కాదు.. పెళ్లిపై జాన్వీకపూర్ షాకింగ్ రియాక్షన్
Recommended Video
దివంగత హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ తన పెళ్లి గురించి స్పందించింది. తాజాగా ఓ ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. తల్లి శ్రీదేవి గురించి ప్రస్తావిస్తూ తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది జాన్వీ. ఆ వివరాలేంటో చూద్దామా..

బాలీవుడ్ తెరపై కాలుమోపి ఆ వెంటనే..
ధడక్ సినిమాతో బాలీవుడ్ తెరపై కాలుమోపిన జాన్వీకపూర్.. బీ టౌన్ ఆడియన్స్ మనసు దోచేసింది. మొదటి సినిమా లోనే అద్భుతమైన నటనా ప్రతిభ కనబర్చి, తనలో తల్లి శ్రీదేవి నటనా లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని నిరూపించుకుంది. ఇక ఎప్పుడూ అందం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకునే జాన్వీ పెళ్లి విషయంలోనూ అలాగే మాట్లాడుతోంది.

శ్రీదేవికి నమ్మకం ఉండేది కాదు
తనపై తన తల్లి శ్రీదేవికి నమ్మకం ఉండేది కాదని, తాను ఎక్కడ ప్రేమలో పడతానని తన తల్లి శ్రీదేవి భయపడుతూ ఉండేదని జాన్వీ తెలిపింది. పెళ్లి వయసు వచ్చినపుడు తానే ఓ అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానని తల్లి శ్రీదేవి ఎప్పుడూ చెబుతూ ఉండేదని జాన్వీ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే పెళ్లి ఎక్కడ, ఎలా చేసుకోవాలనుకుంటుందో కూడా చెప్పేసింది.

అబ్బాయి క్వాలిటీస్ ఇలా ఉండాలి
ఇక తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కూడా తెలిపింది జాన్వీకపూర్. అతనిలో మంచి టాలెంట్ ఉండాలని, అలాగే తన జీవిత భాగస్వామి దగ్గర నుంచి కొత్త విషయాలు నేర్చుకునేలా ఉండాలని ఆమె చెప్పింది. తాను చేసే పని పట్ల అతనికి కూడా అంకితభావం ఉండాలని, అప్పుడే మా మధ్య బాండింగ్ బలంగా ఉంటుందని పేర్కొంది జాన్వీ.

పెళ్లి ఎక్కడ, ఎలా..?
తన పెళ్లి సంప్రదాయ పద్దతిలో చేసుకోవాలని ఉందని చెప్పిన జాన్వీ, అందుకు తిరుపతి సరైన లొకేషన్ అని పేర్కొంది. అంతేకాదు తన పెళ్లిలో సంప్రదాయ కంజీవరమ్ చీరను ధరిస్తానని, దక్షిణాది వంటకాలతో తనపెళ్లి వేడుకను ఘనంగా జరుపుకోవాలని ఉందని జాన్వీ చెప్పుకొచ్చింది.

జాన్వీకపూర్ సినీ జర్నీ
ప్రస్తుతం జాన్వీ కపూర్ కరణ్ జోహార్ నిర్మాణంలో రెండు సినిమాలు చేస్తోంది. దీంతో పాటు కార్గిల్ గర్ల్ సినిమాలో కూడా నటిస్తోంది. ఆమె నటిస్తున్న 'గుంజన్ సక్సేనా' 2020 మార్చిలో విడుదల కానుంది. ఇటీవల వస్తున్న వార్తల ప్రకారం జాన్వీ త్వరలోనే సౌత్‌లో హీరోయిన్‌గా పరిచయం కాబోతోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











