100 కోట్ల ధడక్.. వసూళ్లు జోరు!.. హృదయాల్ని గెలుచుకొన్న జాహ్నవి !

By Rajababu

బాక్సాఫీస్ వద్ద ఢడక్ చిత్ర కలెక్షన్ల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. జూలై 20న రిలీజైన ఈ చిత్రం సరికొత్త మైలురాయిని చేరుకొన్నది. యువ దర్శకుడు శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో మరాఠీ చిత్రం సైరత్ రీమేక్‌గా రూపొందింది. ఈ చిత్రంలో శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్, షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ జంటగా నటించారు. కొత్త తారలతో రూపొందించిన ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరింది.

 పది రోజుల్లో వందకోట్లు

పది రోజుల్లో వందకోట్లు

ధడక్ చిత్రం తొలివారాంతంలోనే రూ.33.76 కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత తొలివారంలో రూ.63.39 కోట్లు వసూలు చేసింది. పదిరోజల తర్వాత ధడక్ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రెండో వారంలో కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్నది.

కరణ్ జోహర్ ట్వీట్

ధడక్ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరడంపై నిర్మాత కరణ్ జోహర్ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల హృదయాలను ధడక్ చిత్రం గెలుచుకొన్నది. వరల్డ్ వైడ్ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. కొత్త హీరో, హీరోయిన్లతో తీసిన ఈ చిత్రానికి ఈ రేంజ్‌లో కలెక్షన్లు రావడం అరుదైన విషయం. ఈ విజయానికి కారణమైన జాహ్నవి, ఇషాన్‌ను అభినందిస్తున్నాను అని కరణ్ ట్వీట్ చేశారు.

 జాహ్నవి మ్యాజిక్

జాహ్నవి మ్యాజిక్

ధడక్ విజయానికి కారణం జాహ్నవి మాత్రమే అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంటుండగా.. అలనాటి అందాల తార శ్రీదేవి ఆకస్మిక మరణం పొందారు. ఆ విషాదంలో నుంచి త్వరగా తేరుకొని జాహ్నవి ధడక్ షూటింగ్ హాజరయ్యారు. ఆ షూటింగ్ జాహ్నవి మనోనిబ్బరం చూసి సినీ వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యారు.

అమ్మ చెప్పడంతోనేనని జాహ్నవి

అమ్మ చెప్పడంతోనేనని జాహ్నవి

నా తల్లి మరణం తర్వాత నన్ను తీవ్ర విషాదం వెంటాడింది. అయితే ఆ విషాదం నుంచి బయటపడాలని గట్టిగా నిర్ణయం తీసుకొన్నాను. అందుకే అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే నేను షూటింగ్ హాజరుకావాలనుకొన్నాను. కానీ షూటింగ్ లేకపోవడంతో సాధ్యపడలేదు. ఎన్నీ అడ్డంకులు ఎదురైనా ప్రొఫెషనల్‌గా వ్యవహరించాలని నా తల్లి చెప్పేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాహ్నవి వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X