షాకిస్తున్న జాన్వీ కపూర్ లుక్.. అమ్మ మరణించాక, భరించి ఉండేదాన్ని కాదు!

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కెరీర్ నెమ్మదిగా వేగం పుంజుకుంటోంది. దఢక్ చిత్రంతో జాన్వీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో జాన్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. జాన్వీ కపూర్ నటనలో ఎలాంటి లోపాలు లేవని అందమైన హావభావాలు పలికిస్తూ బాగా నటించిందని క్రిటిక్స్ అభినందించారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ రెండవ చిత్రానికి సిద్ధం అవుతోంది. జాన్వీ వరుసగా కరణ్ జోహార్ నిర్మాణంలోనే చిత్రాలు చేస్తుండడం విశేషం. జాన్వీ కపూర్ తదుపరి చిత్రానికి సంబందించి లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గుంజన్ సక్సేనా బయోపిక్

గుంజన్ సక్సేనా బయోపిక్

1999 కార్గిల్ యుద్ధంలో అత్యంత సాహసోపేతంగా గాయపడ్డ సైనికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్ తెరకెక్కించేందుకు రంగం సిద్ధం అవుతోంది. కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ లో ఈ చిత్రం నిర్మించబడుతోంది. ఈ బయోపిక్ లో సక్సేనా పాత్రలో నటించబోతున్నట్లు జాన్వీ కపూర్ పేరు వినిపించింది. ఆ వార్తలు నిజమయ్యాయి. ఈ చిత్రం కోసం జాన్వీ అప్పుడే వర్క్ ప్రారంభించేసింది.

జాన్వీ లుక్ వైరల్

జాన్వీ లుక్ వైరల్

జాన్వీ కపూర్ దఢక్ చిత్రం తరువాత కరణ్ జోహార్ నిర్మాణంలోనే థక్త్ చిత్రంలో నటించబోతోంది. ఆ చిత్రానికి ఇంకా ప్రారంభం కాకముందే జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా బయోపిక్ కి సంబంధించిన పనులు ప్రారంభించడం విశేషం. జాన్వీ పైలెట్ డ్రెస్ ధరించి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించే ముందుగా జాన్వీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి కొన్ని ప్రాధమిక విషయాల్లో శిక్షన పొందుతున్నట్లు తెలుస్తోంది.

అమ్మ మరణించాక

అమ్మ మరణించాక

జాన్వీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలతో బిజీ కావడం వలనే అమ్మ మరణించిన విషాదం నుంచి కోలుకుంటున్నానని తెలిపింది. అమ్మ అమరణించక వెంటనే దఢక్ షూటింగ్ ప్రారంభించారు. అది నాకు మంచే చేసింది. లేకుంటే అమ్మ జ్ఞాపకాలతో ప్రతి రోజు వేదన అనుభవించేదాన్ని అని జాన్వీ తెలిపింది.

పనిలో బిజీ కావడం

పనిలో బిజీ కావడం

కుటుంబ సభ్యులు అందించిన సహకారం, పనిలో బిజీ కావడం వలన ఆ విషాదాన్ని మరచిపోగలుగుతున్నాని జాన్వీ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్ లో అనూహ్య పరిస్థితుల మధ్య మరణించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మరణం అప్పట్లో అనేక అనుమానాలకు, సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X