చీరలో జూనియర్ శ్రీదేవీ అందాలు.. నవ్వుతో కుర్రాళ్ల మతిపోగుడుతోన్న జాన్వీ
అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవీ.. ముద్దుల తనయ జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. నాన్న కూచి, అమ్మచాటు బిడ్డలా ఉండే జాన్వీ.. సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. సోషల్ మీడియాలో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. నిత్యం తన అందాలను ఆరబోసే ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంటుంది.
వెబ్ సిరీస్‌లో జాన్వీ
హారర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్న సంగతి తెలిసిందే. దెయ్యాల కథ అన్నది ఎప్పుడూ హిట్ ఫార్మూలానే. ఘోస్ట్ స్టోరీస్ అంటూ భయపెట్టేందుకు వస్తోన్నట్టు జాన్వీ కపూర్ తెలిపింది. కొత్త ఏడాది ప్రారంభంలో వెన్నులో వణుకు పుట్టించేందుకు వస్తోన్నట్లు ప్రకటించింది. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లానే.. నాలుగు విభిన్న కథలతో ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తోంది.

చీరలో జాన్వీ లుక్ వైరల్..
తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఓ పిక్ తెగ వైరల్ అవుతోంది. చీరకట్టులో జాన్వీ అందాలను చూసిన నెటిజన్లు లైకులు, షేర్లతో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఆ చిరు దరహాసంతో మతులను పోగోడుతోందని కామెంట్లు చేస్తున్నారు.
Recommended Video

పలు ప్రాజెక్ట్‌లతో బిజీ
ఇక జాన్వి సినిమాల విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ 'గుంజన్ సక్సేనా' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా కరణ్ జోహార్ 'తఖ్త్' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











