Sridevi Death: అమ్మ విషయంలో నాన్న చేసిన తప్పు.. డాక్టర్స్ హెచ్చరించినా వినలేదు: జాన్వీ కపూర్

అతిలోకసుందరిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అందాల నటి శ్రీదేవి మరణించి ఏళ్ళు గడుస్తున్నా కూడా ప్రేక్షకులు మాత్రం ఆమెను మర్చిపోలేదు అనే చెప్పాలి. సోషల్ మీడియాలో శ్రీదేవికి సంబంధించి చాలా రకాల వీడియోలు ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే శ్రీదేవి మృతి పై అప్పట్లో అనేక రకాల రూమర్స్ కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. దుబాయిలో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం వెళ్ళిన శ్రీదేవి అక్కడ బాత్రూంలో కింద పడి చనిపోయినట్లుగా అప్పుడు ఒక వివరణ అయితే ఇచ్చారు.

అయితే ఆమెకు పలు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు వారి సన్నిహితులు తెలిపారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ తన తల్లి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పింది. శ్రీదేవి ఆరోగ్యం విషయంలో ఆమె భర్త బోణి కపూర్ కూడా కొన్ని తప్పులు చేసినట్లుగా ఆ వివరణలో అర్థమైంది. జాన్వీ కపూర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాన్నా తరచుగా సిగరెట్లు తాగుతూ ఉంటారని అయితే అలవాటు మరింత ముందరుంది.

Janhvi Kapoor sensational comments on her father smoking and mother health situation

దీంతో చిన్నప్పుడు నేను నా సోదరి ఖుషి ఇద్దరం కలిసి ఉదయాన్నే ఆ సిగరెట్ ప్యాకెట్లను చెత్తబుట్టలో పడేసేవాళ్ళం. లేదంటే సిగరెట్లు కత్తిరించడం లేదా వాటిని ఓపెన్ చేసి టూత్ పేస్ట్ రాయడం చేసే వాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్నగారు సిగరెట్లు తాగకూడదు అని మేము ప్రయత్నం చేసేవాళ్లము. కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయన అలవాటు నుంచి బయట పడలేదు.

ఆ విషయంలో అమ్మ నాన్న ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవాళ్ళు. అయితే నాన్న సిగరెట్లు మానేసే వరకు కూడా నేను మాంసం ముట్టుకోను అని అమ్మ ఒక శపథం చేసింది. అయితే అప్పుడు వైద్యులు ఆమె మాంసం తింటేనే మరింత స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పారు. కానీ అప్పటికే అమ్మ చాలా వీక్ గా మారిపోయింది.

మాంసం తినకపోతే మళ్లీ ఇబ్బంది అవుతుంది అని కూడా వైద్యులు చాలాసార్లు చెప్పారు. కానీ మా అమ్మ మాత్రం ఆ విషయంలో వెనక్కి తగ్గలేదు. నాన్నా కూడా బ్రతిమాలినా ఆమె వినలేదు. అలాగే ఆయన కూడా సిగరెట్లు మానేయలేదు. చివరికి ఆ విషయంలో ఇప్పుడు ఆలోచిస్తున్న నాన్నగారు చాలా బాధపడుతూ ఉంటారు. తనకోసం ఈసారైనా సిగరెట్లు మానేస్తాను అని అంటూ ఉంటారు అని జాన్వికపూర్ తెలియజేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X