బట్టలు లేవా? జాహ్నవి డ్రస్‌పై దారుణంగా ట్రోలింగ్.. దిమ్మతిరిగే జవాబుతో నోర్మూయించిన బ్యూటీ
ప్రజల జీవితాల్లో సోషల్ మీడియా భాగమైన తర్వాత ఎవరినీ ఏమైనా విమర్శించే స్థాయి పెరిగింది. అయితే సినీ తారలకు నెటిజన్ల నుంచి ఇటీవల కాలంలో ట్రోలింగ్స్ ఎక్కువగానే అయ్యాయి. నేరుగా వారిని ప్రశ్నించే, విమర్శించేందుకు సోషల్ మీడియా సులువు కావడంతో ఇలాంటి ట్రోల్స్ నిత్యం కనిపిస్తున్నాయి. తాజాగా జాహ్నవి కపూర్‌ను ఉద్ధేశించి ఓ నెటిజన్ చేసిన కామెంట్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్ ట్రోలింగ్‌కు జాహ్నవి దిమ్మతిరిగే సమాధానం ఎలా ఇచ్చారంటే..

దారుణంగా నెటిజన్ ట్రోలింగ్
సాధారణంగా ఫ్యాషన్‌ను మెయింటెన్ చేయడంలో జాహ్నవి కపూర్ ముందుంటారు. తల్లి శ్రీదేవిని స్ఫూర్తిగా తీసుకొని బట్టలు ధరించడంలో ప్రత్యేక శ్రద్ద చూపిస్తారనే ఇండస్ట్రీలో చెప్పుకొంటారు. అయితే తనకు నచ్చిన బట్టలను అప్పుడప్పుడూ రిపీట్ చేస్తుంటారు. దానిని దృష్టిలో పెట్టుకొని ఓ నెటిజన్ దారుణంగా కామెంట్ చేశారు.

కొత్త బట్టలు లేవా?
కొత్త బట్టలు కొనుక్కోవడానికి బట్టలు లేవా.. వేసుకొన్న బట్టలే మళ్లీ మళ్లీ ధరిస్తున్నావు అని నెటిజన్ కామెంట్ చేశాడు. దానిపై జాహ్నవి స్పందిస్తూ... రోజూ కొత్త బట్టలు వేసుకొనేంతగా డబ్బులు ఇంకా సంపాదించలేదు అని ధీటుగా జవాబిచ్చింది. ఇలాంటి కామెంట్లన్నింటీకి ఒకే జవాబుతో నెటిజన్ల నోర్మూయించిందనే మాట వినిపిస్తున్నది.

ప్రతీ ఒక్కరిని సంతృప్తి పరుచలేం
సోషల్ మీడియా బలంగా ఉన్న రోజుల్లో ప్రతీ ఒక్కరిని సంతృప్తి పరుచలేం. ప్రతీ విషయాన్ని సీరియస్‌గా పట్టించుకోవద్దు. ఒకవేళ నీవు చేసే పనిలో ఏదైనా పొరపాట్లు ఉండే దానిపై దృష్టిపెట్టాలి. జిమ్‌కు వెళ్లేటప్పుడు నేను ఏం వేసుకోవాలనేది నా వృత్తికి సంబంధించిందా? అని జాహ్నవి ప్రశ్నించారు.

కార్గిల్ గర్ల్‌గా జాహ్నవి కపూర్
ధడక్ చిత్రం తర్వాత జాహ్నవి ప్రస్తుతం పైలెట్ గంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న కార్గిల్ గర్ల్ అనే చిత్రంలో నటిస్తున్నది. 1999 కార్గిల్ వార్ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. అలాగే కరణ్ జోహర్ రూపొందించే తఖ్త్ చిత్రంలోనూ, రాజ్ కుమార్ రావుతో రుహ్ ఆఫ్జా చిత్రంలో హీరోయిన్ పాత్రను పోషిస్తున్నది.


Click it and Unblock the Notifications











