పికాక్‌పై విరబూసిన జాహ్నవి కపూర్ సొగసులు (ఫోటోస్)
'ధడక్' సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి-బోనీకపూర్ ముద్దుల కూతురు జాహ్నవి తొలి సినిమాతోనే నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ తరం యంగ్ జనరేషన్‌కు ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోయిన జాహ్నవి తాజాగా పికాక్ అనే మేగజైన్ కవర్ పేజీపై మతిపోగొట్టే అందంతో దర్శనమిచ్చింది.
గతంలో జాహ్నవి కపూర్ చాలా ఫోటో షూట్లలో దర్శనమిచ్చినప్పటికీ... ప్రముఖ డిజైనర్స్ ఫాల్గుని, షేన్ పికాక్ నిర్వహిస్తున్న ఈ మేగజైన్ మీద మాత్రం ఆమె అందాలు సరికొత్తగా విరబూసాయని అభిమానులు చర్చించుకుంటున్నారు.

మతి పోగొట్టిన జాహ్నవి కపూర్ అందం
‘ఉమెన్ టుమారో' పేరుతో జాహ్నవి కపూర్ స్పెషల్ ఫోటో షూట్ పిక్స్ కవర్ పేజీపై పబ్లిష్ చేశారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులో జాహ్నవి మరింత అందంగా కనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జాహ్నవి గోల్ అదే
జాహ్నవి కపూర్ మోడలింగ్ రంగంపై అంతగా ఫోకస్ పెట్టలేదు. నటిగానే తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. యాక్టర్‌గా తనను తాను నిరూపించుకుని తల్లి శ్రీదేవి పేరు నిలబెట్టడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతోంది.

గుంజన్ సక్సేనా బయోపిక్
ప్రస్తుతం జాహ్నవి కపూర్ గుంజన్ సక్సేనా బయోపిక్ చేస్తోంది. ఇటీవలే లక్నోలో షెడ్యూల్ ముగించుకుని ముంబై తిరిగి వచ్చింది. చాలా రోజుల తర్వాత ఆమె ముంబైలోని జిమ్ వద్ద మీడియా కంటపడ్డారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ పాత్రలో...
గుంజన్ సక్సేనా బయోపిక్‌కు శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. గుంజన్ సక్సేనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొదటి కంబాట్ ఫైలట్, 1999 కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషించి శౌర్యచక్ర అవార్డు అందుకున్న తొలి మహిళ. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి... గుంజన్ సక్సేనా తండ్రి అనుజ్ సక్సేనా పాత్రలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











