దొంగదెబ్బ తీయడం పోరాటమా? పాక్ పత్రికను కడిగేసిన జాన్వీకపూర్
జమ్ము, కశ్మీర్‌లో భారత సైనికులను టార్గెట్‌గా చేసుకొని చేసిన దాడి ఘటనపై ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. పుల్వామాలో మరణించిన సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తూనే పాకిస్థాన్ అనుకూల వర్గాలపై సోషల్ మీడియాను వేదికగా చేసుకొని దాడి చేస్తున్నారు. భారత జవాన్లపై జరిగిన దాడిని స్వతంత్రం కోసం పోరాటం అని కథనాన్ని వెలువరించిన పాకిస్థాన్ న్యూస్ పేపర్‌పై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ మండిపడింది.
ఈ ఘటనను ప్రచారం కోసం వాడుకొంటారా అని ప్రశ్నించింది. మా సైనికులు పోరాటం చేసే అవకాశం లేకుండా దొంగదెబ్బ తీశారు. ఇదేనా మీ స్వాతంత్ర్య పోరాటం అని నిలదీసింది. సైనికుల దుర్మరణాన్ని వేడుక చేసుకోవడం తగదు అని పేర్కొన్నది.

అమర వీరుల కుటుంబాలకు శాంతి, మనోధైర్యం ఇవ్వాలని జాన్వీ కపూర్ ప్రార్థించింది. ఉగ్రదాడిని, అనాగరిక, పిరికిపంద చర్యగా, పలు కుటుంబాలకు తీరని అన్యాయం అభివర్ణించింది. గత దశాబ్దకాలంలో ఇది అతిపెద్ద, దారుణమైన దాడిగా పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











