ఇలాంటి బట్టలేసుకుంటోంది మీ కోసమే..ఫోటోగ్రాఫర్స్‌తో జాన్వీ కపూర్ హాట్ కామెంట్స్!
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది. జాన్వీ కపూర్ గత ఏడాది దఢక్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ గ్లామర్, నటన విషయంలో ఆకట్టుకుంది. జాన్వీ తరచుగా జిమ్ కు వెళుతూ తన ఫిజిక్ ని కాపాడుకుంటోంది. ఇటీవల జాన్వీ కపూర్ జిమ్ కు వెళుతున్న సమయంలో ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. జాన్వీ కపూర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మీ కోసమే ఈ బట్టలేసుకుంటున్నా
జిమ్ వద్ద జాన్వీ కపూర్ కారు దిగగానే ఫోటో గ్రాఫర్స్ తమ కెమెరాలకు పని చెప్పారు. జాన్వీ కపూర్ కొన్ని ఫోజులు ఇవ్వాల్సిందిగా కోరారు. దీనికి జాన్వీ కపూర్ ఫన్నీగా సమాధానం ఇచ్చింది. నేను జిమ్ కోసం కంటే మీ కోసమే రెడీ కావాల్సి వస్తోంది. మీ కోసమే ఈ బట్టలు వేసుకుని వస్తున్నా అని సరదాగా కామెంట్ చేస్తూ వెళ్ళిపోయింది. ప్రతిరోజు జిమ్ వద్ద ఫోటోగ్రాఫర్స్ సెలెబ్రిటీల ఫోటోలు తీస్తుంటారు. ప్రతి రోజు వాళ్ళ కోసమే అందంగా డ్రెస్ వేసుకోవాల్సి వస్తోందని జాన్వీ తెలిపింది.

ఇక నా దగ్గర జిమ్ డ్రెస్ లేదు
గతంలో కరీనా కపూర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. జిమ్ కి వచ్చిన ప్రతి సారి కొత్త జిమ్ డ్రెస్ వేసుకోవాల్సి వస్తోంది. ఎలాంటి డ్రెస్ లో ఉన్నా ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీసేస్తారు. దయచేసి ఇక ఫోటోలు తీయొద్దు. నావద్ద ఉన్న అన్ని జిమ్ డ్రెస్ లు అయిపోయాయి అని కరీనా కపూర్ తెలిపింది.

బయోపిక్ చిత్రం
ప్రస్తుతం జాన్వీ కపూర్ కరణ్ జోహార్ నిర్మాణంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కబోయే చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతోంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో గుంజన్ సక్సేనా పాత్రలో నటించనుంది. 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధంలో గుంజన్ సక్సేనా అసామాన్య ధైర్య సాహసాలని ప్రదర్శించింది.

జాన్వీ ముందు ఉన్న సవాల్
జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. బాలీవుడ్ లో హీరోయిన్లు ఎక్కువగా వారసత్వం నుంచి వస్తున్నారు. చాలా మంది హీరోయిన్లు ఫిల్మీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వారే. జాన్వీ కపూర్ కూడా శశ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తనని తాను నిరూపించుకుని సక్సెస్ సాధించడం జాన్వీ ముందు ఉన్న సవాల్. గుంజన్ సక్సేనా బయోపిక్ తోపాటు థక్త్ చిత్రంలో కూడా జాన్వీ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











