వారణాసిలో జాహ్నవి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్, ఫ్యాన్స్‌కు ఎమోషనల్ నోట్!
బాలీవుడ్ నటి, శ్రీదేవి-బోనీకపూర్ దంపతుల కూతురు జాహ్నవి కపూర్‌కు నేడు ప్రత్యేకమైన రోజు. ఈ రోజు(మార్చి 6) ఈ 'ధడక్' బ్యూటీ 22వ వసంతంలోకి అడుగుపెడుతోంది. సోనమ్ కపూర్‌తో పాటు, బాలీవుడ్ స్టార్స్ జాహ్నవిని విష్ చేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు.
పుట్టిన రోజున జాహ్నవి కపూర్ తన కుటుంబంతో కలిసి వారణాసిలో గడుపింది. తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ కపూర్‌తో కలిసి అక్కడే బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు ఆమె అభిమానులతో షేర్ చేసుకున్నారు.

జాహ్నవి కపూర్ ఎమోషనల్ నోట్
పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సన్నిహితులు విషెస్ చెబుతుండటంతో జాహ్నవి కపూర్ ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు. ‘నాపై మీరు చూపుతున్న ప్రేమకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. నా ఫ్యామిలీకి, నా దేశానికి రుణ పడి ఉంటాను. లవ్ యూ' ఆల్ అంటూ ట్వీట్ చేసింది.

కార్గిల్ గర్ల్
ప్రస్తుతం జాహ్నవి తన తాజా చిత్రం ‘కార్గిల్ గర్ల్' షూటింగులో భాగంగా లక్నోలో ఉంది. పుట్టినరోజు సందర్భంగా లక్నో సమీపంలోని వారణాసి క్షేత్రాన్ని సందర్భించి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయింది.

తల్లి జ్ఞాపకాల నుంచి బయట పడేందుకు
తల్లి శ్రీదేవి మరణించిన తర్వాత ఆ విషాద జ్ఞాపకాల నుంచి బయటపడటానికి జాహ్నవి సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతూ బిజీ అయిపోయారు.

జాహ్నవి కపూర్
2018లో వచ్చిన ‘ధడక్' చిత్రంతో బాలీవుడ్ తెరం గ్రేటం చేసిన జాహ్నవి తొలి చిత్రంతోనే పెర్ఫార్మెన్స్ పరంగా మెప్పించింది. తన తల్లి శ్రీదేవి పేరు నిలబెట్టడమే లక్ష్యంగా విభిన్నమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.


Click it and Unblock the Notifications











