twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఆ పాపులర్ సింగర్‌తో అఫైర్.. నా లేటేస్ట్ లవర్‌కు తెలియదు.. ఎలా మేనేజ్ చేశానంటే’

    |

    బిగ్‌బాస్ హిందీలో హాట్ జంటగా జస్లీన్ మాతురు, భజన్ కింగ్ అనూప్ జలోటా దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు. వారిద్దరూ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, వివాదాస్పద వ్యాఖ్యలు భారీగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. బిగ్‌బాస్ ఇంట్లో జస్లీన్ రొమాంటిక్ మూమెంట్స్ టెలివిజన్ చానెల్ ర్యాంకింగ్‌‌లను షేక్ చేస్తున్నాయి. తాజాగా బిగ్‌బాస్‌లో తన పాత అఫైర్లకు సంబంధించి జస్లీన్ సంచలన విషయాలను వెల్లడించింది. అవేమిటంటే..

    పాపులర్ సింగర్‌తో నాకు అఫైర్

    పాపులర్ సింగర్‌తో నాకు అఫైర్

    నేను అనూప్ జలోటాతో అఫైర్‌ పెట్టుకోవడానికి ముందు మరో ప్రముఖ గాయకుడితో సంబంధం పెట్టుకొన్నాను. ఆ విషయం గురించి ఇప్పటికీ అనూప్‌కు తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను అని జస్లీన్ చెప్పుకొంటూ పోయింది. ఈ విషయాన్ని తెలిసిన కొందరు సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

    ఇప్పుడు అతడితో రిలేషన్స్

    ఇప్పుడు అతడితో రిలేషన్స్

    అయితే ఆ గాయకుడితో ప్రస్తుతం ఎలాంటి సంబంధాలు లేవు. అతడితో అప్పట్లోనే తెగతెంపులు చేసుకొన్నాను. అనూప్‌తో కలిసిన తర్వాత మళ్లీ ఆయనతో ఎలాంటి రిలేషన్ పెట్టుకోలేదు అని జస్లీన్ వెల్లడించింది.

    ఆమె అఫైర్ గురించి తెలుసు

    ఆమె అఫైర్ గురించి తెలుసు

    జస్లీన్ మాటలను విన్న అనూప్ జలోటా అందరికీ ఝలక్ ఇచ్చాడు. తన పాత అఫైర్ గురించి నాకు తెలియదని అనుకొంటున్నది. కానీ సింగర్ సుఖ్విందర్ సింగ్‌తో జస్లీన్‌కు అఫైర్ ఉందని నాకు తెలుసు. నాకు తెలుసన్న విషయం ఆమెకే తెలియదని అనూప్ షాక్ ఇచ్చాడు.

    ఫారిన్ టూర్లలో అఫైర్

    ఫారిన్ టూర్లలో అఫైర్

    జస్లీన్, సుఖ్వీందర్ సింగ్‌కు మధ్య ఉన్న అఫైర్ గురించి ఆ ట్రూప్‌లోని కొందరు సింగర్లు నాకు ముందే చెప్పారు. ఫారీన్ టూర్లకు వెళ్లిన సమయంలో జస్లీన్, సుఖ్విందర్ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు అని అనూప్ జలోటా చెప్పారు.

    టాలీవుడ్‌లో సుఖ్విందర్ సింగ్

    టాలీవుడ్‌లో సుఖ్విందర్ సింగ్

    దిల్ సే చిత్రంలో చయ్యా చయ్యా పాటతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్న సుఖ్విందర్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు. తెలుగులో చాలా మంచి పాటలు పాడటమే కాకుండా పలు హిట్ పాటలను తన పేరున నమోదు చేసుకొన్నాడు. ఆ మధ్య కాలంలో జస్లీన్, ఇతర సింగర్లతో అఫైర్లు ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

    English summary
    Bigg Boss contestant Jasleen Matharu has revealed that she dated another famous celebrity before coming into a relationship with Anup Jalota. What surprised us the most was that Jasleen revealed Anup Jalota had no idea about her previous fling. Anup Jalota was heard telling Jasleen that he is aware of her relationship with Sukhwinder Singh
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X