కంగనకు షాక్.. పరువు నష్టం దావా వేసిన బాలీవుడ్ ప్రముఖుడు.. బాంద్రా పోలీసుల సమన్లు

బాలీవుడ్‌ హీరోయిన్ కంగన రనౌత్‌కు మరో ఎదురు దెబ్బ తగలింది. ఏడాది కాలంంగా తనపై పలు అరోపణలు చేస్తున్న కంగనపై ప్రముఖ రచయిత జావెద్ అఖ్తర్ పరువు నష్టం దావా వేశారు. దీంతో వారిద్దరి మధ్య వివాదం మరింత రాజేసుకొనే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

 బాలీవుడ్‌లో మాఫియా అంటూ

బాలీవుడ్‌లో మాఫియా అంటూ

సుశాంత్ సింగ్ రాజ్ మరణం తర్వాత కంగన రనౌత్ బాలీవుడ్‌లో ఓ మాఫియా ఉందంటూ సంచలన ఆరోపణలు, విమర్శలు చేశారు. అయితే కేవలం సుశాంత్‌ సింగ్‌ను మాత్రమే కాదు.. ఈ మాఫియా ముఠా చాలా మంది యువ నటులు వేధిస్తుంటారు. కెరీర్ పరంగా అణిచి వేసే ప్రయత్నం చేస్తారు. ఇండస్ట్రీలో బంధుప్రీతి, తమ కుటుంబాల నుంచి వారసులనే ప్రోత్సాహిస్తుంటారు లాంటి విమర్శలను కంగన రనౌత్ ఎక్కుపెట్టారు.

హృతిక్ రోషన్ ఫ్యామిలీతో తగాదా పెట్టుకొంటే..

హృతిక్ రోషన్ ఫ్యామిలీతో తగాదా పెట్టుకొంటే..

కంగన తన ఆరోపణల్లో భాగంగా హృతిక్ రోషన్ ఫ్యామిలీతో కుమ్మక్కై తనను బెదిరించారు. హృతిక్ రోషన్ కుటుంబంతో తగాదా పెట్టుకొంటే ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోతావని బెదిరించారు. అంతేకాకుండా మనాలీలోని తన నివాసానికి సమీపంలో తుపాకీ పేలుళ్లు జరిగిన ఘటనకు ఆయనే కారణం అంటూ కంగన అనుమానం వ్యక్తం చేశారు.

జావెద్ అఖ్తర్ పిలిచి బెదిరింపులు

జావెద్ అఖ్తర్ పిలిచి బెదిరింపులు

హృతిక్ రోషన్‌తో తనకు బ్రేకప్ జరిగిన తర్వాత ఆయన కుటుంబానికి, తనకు పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఆ సమయంలో జావెద్ అఖ్తర్ తన ఇంటికి పిలిచి హెచ్చరించారు. రాకేష్ రోషన్ ఇండస్ట్రీలో చాలా పెద్ద వ్యక్తి. వారికి క్షమాపణలు చెప్పకుంటే నీవు ఎక్కడ ఉంటావో నీకే తెలియదు. వారు నిన్ను జైలుకు పంపుతారు. నీ జీవితాన్ని నీవే పాడు చేసుకోవద్దని బెదిరించారు అని బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

నీకు సూసైడే గతి అంటూ కామెంట్

నీకు సూసైడే గతి అంటూ కామెంట్

రాకేష్ రోషన్ ఫ్యామిలీతో పెట్టుకొంటే నీకు సూసైడే గతి. ఇలాంటి మాటలతో నన్ను బెదిరించారు. నేను హృతిక్ రోషన్‌కు క్షమాపణ చెప్పకపోతే నేను ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వస్తుందో నాకు అర్థం కావడం లేదు అంటూ బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై జావెద్ అఖ్తర్ పరువు నష్టం దావా వేసినట్టు ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

 కంగన, రంగోలికి ముంబై పోలీసుల సమన్లు

కంగన, రంగోలికి ముంబై పోలీసుల సమన్లు

ఇదిలా ఉండగా, ముంబైలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలపై కంగన రనౌత్, ఆమె సోదరి రంగోలి చండేల్‌కు ముంబైలోని బాంద్రా పోలీసులు సమన్లు జారీ చేశారు. వారిని నవంబర్ 10,. 11వ తేదీలలో విచారణకు హాజరుకావాలని సమన్లలో సూచించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X