‘పిఎం నరేంద్ర మెడీ’ బయోపిక్: తన పేరు చూసి షాకైన ప్రముఖ లిరిసిస్ట్

భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ 'పిఎం నరేంద్ర మోడీ'. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. అయితే మూవీ క్రిడెట్స్‌లో తన పేరు ఉండటం చూసి ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ షాకయ్యారు.

ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ... ఈ సినిమాకు నేను లిరిక్స్ రాసినట్లు వేశారు. కానీ నేను ఎలాంటి పాట రాయలేదు. నా పేరు చూసి షాకైనట్లు పేర్కొన్నారు. ఈ సినిమాకు, తనకు లాంటి సంబంధం లేదని జావేద్ అక్తర్ స్పష్టం చేశారు.

Javed Akhtar shocked to see his name on credit list of PM Narendra Modi biopic

అయితే జావేద్ అక్తర్ పేరు పొరపాటున క్రెడిట్స్‌లో వేశారా? లేక ఆ పేరుతో మరొక లిరిసిస్ట్ ఎవరైనా ఉన్నారా? అనే విషయంపై చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీ లాంటి రైట్ వింగ్ పార్టీలను వ్యతిరేకించే జావేద్ అక్తర్ తన పేరు రావడంపై అసంతృప్తిగా ఉన్నారు.

కాగా.. 'పిఎం నరేంద్ర మెడీ' ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది ఒక మామూలు ఛాయ్ వాలా.. దేశ ప్రధాని అవుతాడా? అంటూ మొదలైన ఈ ట్రైలర్లో నరేంద్ర మోడీ బాల్యం నుంచి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు జరిగిన జర్నీలోని ముఖ్యమైన ఘట్టాలను ఫోకస్ చేస్తూ రూపొందించారు.

Javed Akhtar shocked to see his name on credit list of PM Narendra Modi biopic

ఏప్రిల్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వివేక్ ఒబెరాయ్‌తో పాటు దర్శన్ కుమార్, బోమన్ ఇరానీ, మనోజ్ జోషి, ప్రశాంత్ నారాయణన్, జరీనా వాహెబ్, బర్ఖా బిస్త్ సేన్ గుప్తా, అంజన్ శ్రీవాస్తవ్, యతిన్ కార్యేకర్, రాజేంద్ర గుప్తా, అక్షత్ ఆర్ సలుజా, ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X