పెళ్లికాకుండా బిడ్డను కంటే ఓకే.. మనవరాలి నవ్య నవేలి గురించి జయబచ్చన్ ఆసక్తికర కామెంట్స్

బాలీవుడ్‌లో సీనియర్ నటి జయ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మనవరాలు నవ్య నవేలి నందా గురించి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. నవ్య నవేలి గురించి వాట్ ది హెల్ నవ్య అనే ప్రాడ్ కాస్ట్‌లో అఫైర్లు, రిలేషన్‌షిప్స్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. పెళ్లి కాకుండానే తన మనవరాలు బిడ్డను కన్నా మాకు అభ్యంతరం లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో వైరల్ అయ్యాయి. జయ బచ్చన్ చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

రిలేషన్‌షిప్‌లో భౌతిక ఆకర్షణ తప్పనిసరి

రిలేషన్‌షిప్‌లో భౌతిక ఆకర్షణ తప్పనిసరి

ఇద్దరు వ్యక్తుల ప్రేమకు సంబంధించిన భౌతిక ఆకర్షణ తప్పనిసరి, వారి మధ్య బ్యాలెన్స్ కంపల్సరి. నా మాటలపై సమాజం నుంచి అభ్యంతకరాలు వ్యక్తం కావొచ్చు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో ఇదే వాస్తవం. మా కాలంలో అలాంటి ప్రయోగాలకు తావు లేదు. ఈ కాలంలో ఇదే జరుగుతున్నది. యువత మధ్య బంధాలు పటిష్టంగా, చిరకాలం ఉండాలి. అయితే ఈ రోజుల్లో ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ లేకపోతే.. ఆ రిలేషన్‌షిప్ ఎక్కువ రోజులు మనగడ సాధించడం లేదు అని అన్నారు. ప్రస్తుత కాలంలో ఇద్దరి మధ్య సమన్వయం, కొత్త అనుభావాలు ఉండాల్సిన అసవరం ఉంది అని జయబచ్చన్ అన్నారు.

యువతపై నాకు జాలి

యువతపై నాకు జాలి

ప్రేమికుల మధ్య సాగుతున్న రిలేషన్‌షిప్ చూస్తే యువతపై జాలి కలుగుతుంది. మా కాలం, నా కూతురు శ్వేత బచ్చన్ సమయంలో కూడా ఇలాంటి వాటి గురించి కనీసం ఆలోచించలేదు. నా మనవరాలు నవ్య విషయంలో అఫైర్ గేమ్ డిఫరెంట్‌గా ఉంది. పెళ్లికి ముందే రిలేషన్‌షిప్.. అనుభవాలను వారు గిల్టీగా ఫీలవుతున్నారు. నా దృష్టిలో కూడా అదే తప్పు అనిపిస్తున్నది. ఒకవేళ శారీరక సంబంధాలు ఉండి.. నా రిలేషన్‌షిప్ వర్కవుట్ కాదు అనే భావన వస్తే.. దానిని కూడా పాజిటివ్‌గా తీసుకోవాల్సిందే అని జయబచ్చన్ అన్నారు.

ఎమోషన్స్, రొమాన్స్ కనిపించడం లేదు

ఎమోషన్స్, రొమాన్స్ కనిపించడం లేదు

యంగ్ జనరేషన్‌కు జయబచ్చన్ సలహాలిస్తూ.. యువతలో భావోద్వేగాలు, రొమాన్స్ కనిపించడం లేదు అన్నారు. నేటి రిలేషన్‌షిప్స్‌ను క్లినికల్‌గా చూడాలి. ఒకవేళ నీకు ఎవరైనా ఫ్రెండ్ బాగా నచ్చితే.. నీవంటే నాకు ఇష్టం. నీవు చాలా మంచి వాడివి అనిపిస్తున్నావు. నీ ద్వారా పిల్లల్ని కనాలనుకొంటున్నాను. అందుకోసం.. సమాజం కోసమైనా మనిద్దరం పెళ్లి చేసుకొందాం. నీవు నచ్చావు కాబట్టి.. పెళ్లి కాకుండా నీతో బిడ్డను కనడానికైనా సిద్దమే. నాకు ఈ విషయంలో ఎలాంటి సమస్య, ఇబ్బంది లేదు అని జయబచ్చన్ అన్నారు.

శారీరక సంబంధాలే ప్రధానం

శారీరక సంబంధాలే ప్రధానం

నేటి ప్రేమికుల మధ్య శారీరక సంబంధాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వారిలో ప్రేమ, అనురాగాలు కనిపించడం లేదు. శారీరక బంధాలు ఉంటేనే ఇద్దరి మధ్య బంధం కొనసాగుతున్నది. కాబట్టి ప్రస్తుతం జనరేషన్ తీరు బాధకరమే కానీ.. ఒప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. ఒకవేళ నా మనవరాలు.. పెళ్లి చేసుకోకుండా బిడ్డను కంటానంటే.. నాకు అభ్యంతరం లేదు అని జయబచ్చన్ చెప్పింది.

జయబచ్చన్ గురించి..

జయబచ్చన్ గురించి..

జయబచ్చన్ విషయానికి వస్తే.. జయ, అమితాబ్ ఇద్దరు ప్రేమించుకొని 1976లో వివాహం చేసుకొన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించి సమాజ్ వాదీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా సేవలు అందించారు. జయబచ్చన్ దంపతులకు శ్వేత, అభిషేక్ అనే సంతానం ఉన్న సంగతి తెలిసిందే. శ్వేత నందా కుమార్తేనే నందా నవేలి. ఈమె గురించే జయబచ్చన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు తన ప్రాడ్‌కాస్ట్‌లో చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X