ఆ హీరోయిన్‌తో భర్త రొమాన్స్.. ఏడ్చేసిన హీరో భార్య, హీరో షాకింగ్ డెసిషన్!
భారతీయ చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య యవ్వారాలు అందరికీ తెలిసిందే. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఇది కొనసాగుతూనే ఉంది. కొందరు నటీనటులు తమ జీవిత భాగస్వాములకు తెలియకుండా చాటుగా ఎఫైర్స్ నడిపించిన ఉదంతాలెన్నో. వీటి గురించి తెలిసినా కొందరు మౌనం దాల్చగా, ఇంకొందరు మాత్రం గట్టిగా నిలదీసి విడాకుల వరకు వెళ్లిన ఘటనలు ఉన్నాయి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని తెరచాటు ప్రేమకథల్లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ - రేఖ ప్రేమాయణం కూడా ఒకటి.
రేఖతో అమితాబ్‌కు తొలి పరిచయం
సినీతారల ప్రేమ కథలన్నీ కూడా వారు నటించిన సినిమాలతోనే మొదలవుతాయి. అలాగే రేఖ, అమితాబ్‌ల మధ్య ప్రేమకు కారణమైంది దో అన్‌జానే. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ఇదే. అయితే అమితాబ్ కంటే రేఖ నటనపరంగా సీనియర్. సెట్స్‌లో ఇద్దరి మధ్యా పరిచయం ప్రేమగా మారింది. అయితే అప్పటికే జయా బచ్చన్‌తో అమితాబ్‌కు పెళ్లి కావడంతో తమ బంధాన్ని గుట్టుగా ఉంచారు అమితాబ్ - రేఖ. ఆమెకు చెందిన ఓ స్నేహితురాలి బంగ్లాలో తరచుగా కలుసుకునేవాళ్లు. అలా దాదాపు రెండేళ్ల పాటు చాలా గోప్యంగా వీరి రహస్య ప్రేమాయణం సాగింది.

నుదిటిన సింధూరంతో రేఖ
ఇదిలాఉండగా.. 1978లో గంగా కీ సౌగంద్ సినిమా షూటింగ్ సమయంలో రేఖ పట్ల ఓ సహనటుడు అభ్యంతరకరంగా ప్రవర్తించడంతో అమితాబ్ రగిలిపోయాడు. అతని దగ్గరికి వెళ్లి తిట్టిపోశాడు.. ఈ ఘటనతో రేఖ పట్ల అమితాబ్‌కు అంతటి అభిమానం ఏంటన్న చర్చ బాలీవుడ్‌లో మొదలైంది. మీడియా కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడంతో వీరిద్దరి గురించి ప్రత్యేక కథనాలు వచ్చాయి. చివరికి రేఖ- అమితాబ్ పెళ్లి చేసుకున్నారంటూ పుకార్లు వైరల్ అయ్యాయి. దీనికి బలం చేకూర్చేలా రిషి కపూర్ పెళ్లిలో పాపిట్లో సింధూరంతో, మెడలో మంగళ సూత్రంతో కనిపించి షాకిచ్చారు రేఖ.
కన్నీటి పర్యంతమైన జయా బచ్చన్
మరుసటి రోజు పేపర్లలో ఈ విషయం ప్రముఖంగా ప్రచురించారు. ఎంత జరుగుతున్నా సరే అమితాబ్ కానీ, రేఖ కానీ ఈ విషయంపై స్పందించలేదు. ఈ క్రమంలో ముకద్దర్ కా సికందర్ సినిమాలో రేఖ, అమితాబ్‌లు జోడీగా నటించగా.. ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌కు జయబచ్చన్ వచ్చారు. ఆ సమయంలో ప్రొజెక్షన్ రూమ్‌లో ఉన్న రేఖ.. జయబచ్చన్ ముఖాన్ని స్పష్టంగా గమనించారు. తనకు, అమితాబ్‌కు మధ్య లవ్, రొమాన్స్ సీన్స్ వస్తున్నప్పుడు ఆమె కంటి నుంచి ధారగా వస్తున్న నీటిని చూశారు.
రేఖతో 44 ఏళ్లుగా నటించని అమితాబ్
ఈ ఘటన తర్వాత అనూహ్య నిర్ణయం తీసుకుని ఇండస్ట్రీకి షాకిచ్చారు అమితాబ్. అప్పటికీ హిట్ పెయిర్‌గా ఉన్న రేఖ- అమితాబ్‌లు ఇకపై కలిసి నటించరని ఆయన దర్శక, నిర్మాతలకు చెప్పేశారట. ఈ సినిమా తర్వాత 1981లో వచ్చిన సిల్‌సిలాలో చివరిసారిగా అమితాబ్ - రేఖ కలిసి నటించారు. అయితే ఇంత జరిగినా రేఖ - జయబచ్చన్‌ల మధ్య సహృద్భావ వాతావరణమే ఉండటం హైలైట్. అలా కొన్నేళ్లపాటు భారతీయ చిత్ర పరిశ్రమను, బాలీవుడ్‌ను ప్రభావితం చేసిన ఓ ప్రేమకథ మరుగున పడింది. అమితాబ్‌కి రేఖకి పెళ్లయ్యిందా? వీరిద్దరి మధ్య ఇంకా రిలేషన్ నడుస్తుందా? అంటూ అప్పుడప్పుడు మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ రేఖతో నటించనని అమితాబ్ రాత్రికి రాత్రి ఎందుకు నిర్ణయం తీసుకున్నాడన్నది ఇప్పటికీ మిస్టరీయే.


Click it and Unblock the Notifications











