జెర్సీ బాలీవుడ్ రీమేక్.. ఆలస్యమైనా మంచి నిర్ణయమే తీసుకున్నారు!
బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికి విమర్శకుల ప్రశంసలు అందుకున్న తెలుగు చిత్రం జెర్సీ. నాని నటించిన ఈ సినిమా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ గా తెరకెక్కింది. అయితే ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని చాలా మంది బాలీవుడ్ హీరోలు మొదట్లో ఇంట్రెస్ట్ చూపించారు. ఇక అందరికంటే ముందుగా ఆ అవకాశాన్ని షాహిద్ కపూర్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఇక జెర్సీ రీమేక్ ను కథ ఒరిజినల్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు నిర్మాతలు దిల్ రాజు, అల్లు ఆరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యింది. అయితే రిలీజ్ విషయంలో మాత్రం నిర్మాతలు ఏ మాత్రం రిస్క్ చేయడానికి ఇష్ట పడటం లేదు. ఎంత ఆలస్యం అయినా కూడా కరెక్ట్ టైమ్ లో విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
ప్రభాస్ - రాకీ భాయ్: Salaar Movie Pooja & Launch Photos

ఇక షాహిద్ కపూర్ ఆలోచన ప్రకారం నిర్మాతలు ఈ ఏడాది నవంబర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దసరా టైమ్ లో విడుదల చేయాలని అనుకున్నప్పటికి అప్పుడు పెద్ద హోరోలు వస్తుండడంతో నవంబర్ 5న దీపావళి సందర్భంగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
తప్పకుండా సినిమా నార్త్ జనాలకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందని నిర్మాతలు భారీగా ఖర్చు చేసి సినిమాను నిర్మించినట్లు సమాచారం. మరి తెలుగు నిర్మాతలకు బాలీవుడ్ వద్ద ఎంతవరకు లాభాలు అందుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











