‘రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్’ జాహ్నవి కపూర్
'ధడక్' సినిమా ద్వారా ఈ ఏడాది సినీ రంగ ప్రవేశ చేసి శ్రీదేవి-బోనీ కపూర్ దంపతుల కూతురు జాహ్నవి కపూర్ తొలి అవార్డ్ అందుకున్నారు. మొదటి సినిమాతోనే నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నందుకుగాను ముంబైలోని రాయల్ నార్వేజియన్ కాన్సులేట్ ఈ అవార్డ్ అందజేసింది.
ముంబైలో జరిగిన అవార్డ్ ప్రధానోత్సవానికి జాహ్నవి కపూర్ తన తండ్రి బోనీ కపూర్‌తో కలిసి హాజరయ్యారు. బ్లూ కలర్ సారీలో హాజరైన జాహ్నవి స్టన్నింగ్ లుక్‌తో సభికులను ఆకట్టుకున్నారు. అవార్డుకు అందుకున్న సందర్భంగా తన స్పీచ్‌తో అందరినీ మెప్పించారు.

కెరీర్లో తొలి అవార్డ్ అందుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇది నాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఇది ఎంతో ముఖ్యమైన అవార్డుగా భావిస్తాను, నా సినిమాలు, నటన ద్వారా ఎక్కువ మందిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాను అని జాహ్నవి కపూర్ తెలిపారు.
జాహ్నవి కపూర్ నటించబోయే తర్వాతి సినిమాల విషయానికొస్తే... కరణ్ జోహార్ తెరకెక్కించబోయే తఖ్త్'లో ఆమె కీలక పాత్రలో నటించనున్నారు. రణబీర్ కపూర్, కరీనా కపూర్, ఆలియా భట్, అనిల్ కపూర్ లాంటి స్టార్స్ నటిస్తున్న ఈ చిత్రం 2020లో విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











