నిరుత్సాహపరుస్తున్న శ్రీదేవి తనయ... కార్గిల్ గర్ల్ గా మెప్పించలేకపోతున్న జాన్వి
తుదిశ్వాస విడిచేవరకూ తన కూతురి సినీ కెరీర్ గురించి అతిలోక సుందరి శ్రీదేవి ఎంతగానో పరితపించింది. కానీ, చివరకు జాన్వీ తొలి సినిమా విడుదలకు ముందే దివికెగసింది. తల్లి కోరకను నెరవేర్చేందుకు రంగంలోకి దిగిన జాన్వి, అనుకున్న స్థాయిలో రాణించలేక డీలా పడుతోందని తెలుస్తోంది.
ధఢఖ్ సినిమాతో కరణ్ జోహార్ స్టైల్ హీరోయిన్ గా గ్లామరస్ ఎంట్రీ ఇచ్చినా, నటనలో ఇంకా అమ్మాయి రాటుదేలాలి అని అప్పుడే విమర్శకులు పెదవి విరిచేశారు. ఆ తరువాత నెట్ ఫ్లిక్స్ కోసం చేసిన ఘోస్ట్ స్టోరీస్ లోనూ అమ్మడి నటన సోసోగానే ఉందని తేల్చేశారు. ఇక గుంజన్ సక్సేనా బయోపిక్ తోనైనా అమ్మడు తన సత్తా చాటుకుంటుందని అందరూ ఎదురుచూశారు. కానీ, కార్గిల్ గర్ల్ గా జాన్వి ఏమాత్రం నిలబడలేకపోయింది.

నిజజీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన గుంజన్ సక్సేనాలో సపోర్టింగ్ రోల్స్ లో అందరూ టాలెంటెడ్ నటీనటులే కనిపించారు. వారి నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి అనడంలో సందేహమే లేదు. ముఖ్యంగా హీరోయిన్ తండ్రిపాత్రలో నటించిన యాక్టర్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, లీడ్ రోల్ లో ధీరత్వం చూపించాల్సిన జాన్వి, నటనలో పూర్తిగా తేలిపోయిందని ఫిల్మ్ క్రిటిక్స్ తేల్చేశారు. ఇలాంటి పాత్రలు పోషించేందుకు అమ్మడు నటనలో ఇంకొంత తర్ఫీదు పొందాల్సి ఉందని స్పష్టం చేశారు. మరి రాబోయే రోజుల్లో అయినా జాన్వి నటనకు మరింత పదునుపెట్టి రాణిస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











