తెలుగు హీరోతో జాన్వీ కపూర్.. ఈసారైనా ఒప్పుకుంటుందా?
టాలీవుడ్ లో అతిలోక అందరిగా ఎంతగానో క్రేజ్ అందుకున్న శ్రీదేవి అంటే తెలుగు జనాలకు ఎంత ఇష్టమో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆమె కూతుళ్ళు కూడా తెలుగులో నటిస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి గాని సినిమాలు మాత్రం రావడం లేదు. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఇంకా సరైన ట్రాక్ అయితే సెట్ చేసుకోలేదు. అందుకే ఆమె ఒక స్టేజ్ కు వచ్చే వరకు అప్పుడే మిగతా భాషల్లో నటించకూడదనే ఆలోచనలో ఉన్నట్లు టాక్.
అసలు మ్యాటర్ లోకి వస్తే మొత్తానికి జాన్వీ కపూర్ ఒక తెలుగు హీరోతో నటించే ఆవకాశం ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు అయితే గట్టిగానే వస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అని సమాచారం. బెల్లంకొండ బాబు నెక్స్ట్ బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ తో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు మన కమర్షియల్ దర్శకుడు వివి.వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు.

ఇక ఛత్రపతిలో శ్రియ చేసిన హీరోయిన్ క్యారెక్టర్ కోసం జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నారట. వీలైనంత వరకు అగ్ర హీరోయిన్స్ ను ఫిక్స్ చేయాలని చూస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు జాన్వీని కూడా సంప్రదించినట్లు సమాచారం. ఆల్ మోస్ట్ ఒకే చేసినట్లు తెలుస్తోంది గాని ఇంకా జాన్వీ ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని బాలీవుడ్ మీడియాలో కొత్త తరహా కథనాలు కూడా వస్తున్నాయి. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











