జాహ్నవి హ్యాపీ మూడ్.. సెలబ్రేషన్స్‌లో శ్రీదేవి కూతురు!
దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవిని ఓ వైపు విషాదాన్ని దిగమింగుతూ తన తొలి సినిమాను పూర్తి చేసింది. యువ హీరో ఇషాన్ కట్టర్‌తో ఆమె నటిస్తున్న దఢక్ చిత్ర షూటింగ్ పూర్తయింది. దాంతో జాహ్నవి, ఇషాన్ ఇద్దరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకొన్నారు. దఢక్ షూటింగ్ పూర్తయిన రోజే తన తొలి సినిమా బియాండ్ ది క్లౌడ్స్ రిలీజ్ కావడంతో ఇషాన్ ఆనందం రెండితలైంది.
దఢక్ షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు శశాంక్ ఖైతాన్, జాహ్నవి తండ్రి, నిర్మాత బోనికపూర్ తదితరులు హాజరయ్యారు.

మరాఠీలో ఘన విజయం సాధించిన సైరాత్ చిత్రం ఆధారంగా దఢక్ సినిమా రూపుదిద్దుకొంటున్నది. ఈ చిత్రం ద్వారా జాహ్నవి బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం జూలై 20న రిలీజ్‌కు ముస్తాబవుతున్నది.
janhvi kapoor ishaan khatter dhadak boney kapoor sridevi జాహ్నవి కపూర్ ఇషాన్ కట్టర్ బోనికపూర్ శ్రీదేవి


Click it and Unblock the Notifications