దివ్యభారతీ, శ్రీదేవి మరణాలు తెరపైకి.. జియాఖాన్‌ కేసును సిబీఐకి అప్పగించాలి అంటూ

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసును సీబీఐ అప్పగించడంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. బాలీవుడ్‌లో చోటుచేసుకొన్న కొన్ని అనుమానాస్పద మరణాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలనే డిమాండ్ ఊపందుకొన్నది. దివ్యభారతీ, శ్రీదేవి మరణాలపై దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇతర అనుమానాస్పద మరణాల వివరాల్లోకి వెళితే..

Recommended Video

#CBIForSSR : Kangana Ranaut, Sonu Sood రియాక్షన్ , న్యాయం జరగాలని డిమాండ్ | Onrindia Telugu
 జియాఖాన్ మరణంపై అనుమానాలు

జియాఖాన్ మరణంపై అనుమానాలు

బాలీవుడ్‌లో సంచలనం రేపిన జియా ఖాన్ మరణంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్ పంచోలి నటి జియా ఖాన్ మరణానికి కారణమనే ఆరోపణలు వచ్చాయి. రాజకీయ, సినీ వర్గాల ఒత్తిడి కారణంగా జియా ఖాన్‌ కేసును తప్పుదోవ పట్టిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జియా తల్లి రిబియా ఖాన్ ఇప్పటికీ తన కూతురు మరణం వెనుక కారణాలు, ఉన్న వ్యక్తుల పేర్లు బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.

దివ్య భారతి మృతిపై సందేహాలు

దివ్య భారతి మృతిపై సందేహాలు

బాలీవుడ్ యువతార దివ్య భారతీ మరణంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎత్తైన భవనంపై నుంచి దూకి ప్రమాదవశాత్తు మరణించారనే వార్తలపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. నిర్మాత సాజిద్ నడియావాలాతో అఫైర్‌ కారణంగానే దివ్య భారతీ మరణించారనే విషయం ఆరోపణలుగానే మిగిలిపోయాయి.

 దుబాయ్‌లో శ్రీదేవి అనుమానాస్పదంగా

దుబాయ్‌లో శ్రీదేవి అనుమానాస్పదంగా


ఇక రెండేళ్ల క్రితం దుబాయ్‌లో శ్రీదేవి మరణం కూడా అనేక అనుమానాలకు దారి తీసింది. దుబాయ్‌లోని బాత్రూంలోని టబ్‌లో మునిగి మరణించారనే విషయంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. శ్రీదేవి మరణం వెనుక వాస్తవాలను బయటకు తీసుకురావాలనే డిమాండ్ నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నది.

బాలీవుడ్‌లో పర్వీన్ బాబీ, ఇతర నటులు

బాలీవుడ్‌లో పర్వీన్ బాబీ, ఇతర నటులు

అలాగే గతంలో మరణించిన పర్వీన్ బాబీ, ఇతర మరణాలపై కూడా దర్యాప్తు చేయాలనే డిమాండ్ వస్తున్నది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించడంపై నెటిజన్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఓ వర్గం మాఫియాతో సంబంధాలున్నాయనే విషయంపై దర్యాప్తు చేపట్టాలని కూడా డిమాండ్ లేవనెత్తుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X