twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా బిడ్డ, సుశాంత్ బలి.. డబ్బు, పవర్‌తో కేసులు నిర్వీర్యం.. సల్మాన్‌పై జియాఖాన్ తల్లి ధ్వజం

    |

    బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సంఘటనపై బాలీవుడ్‌లో వివాదాలు చెలరేగుతుండగా మరోపక్క జియా ఖాన్ సూసైడ్ కేసు తెరపైకి వచ్చింది. తన కూతురు ఆత్మహత్య ఘటనలో నిందితులకు శిక్ష పడకుండా సల్మాన్ ఖాన్ కేసును తప్పుదోవ పట్టించారని జియా ఖాన్ తల్లి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేసిన ఆమె తన కూతురుకు ఎలా అన్యాయం చేశారనే విషయాన్ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది...

    Recommended Video

    Jiah Khan Mother Slams Salman Khan
    జీవితాలను నాశనం చేసే వారిని ఎదిరించాలి

    జీవితాలను నాశనం చేసే వారిని ఎదిరించాలి

    తాజా వీడియోలో జియా ఖాన్ తల్లి రాబియా ఆమీన్ మాట్లాడుతూ... బాలీవుడ్‌లో జరుగుతున్న అన్యాయాలు ఇక చాలు. ఇకనైనా అందరూ ప్రతిఘటించాల్సిన సమయం ఆసన్నమైంది. జీవితాలను నాశనం చేసే వ్యక్తులను ఎదురించాల్సిందే. లేకపోతే జియాఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాంటి వాళ్లు జీవితాన్ని ఆర్ధాంతరంగా ముగించాల్సి వస్తుంది అని అన్నారు.

    జియా ఖాన్ కేసులో సూరజ్‌ అండగా సల్మాన్

    జియా ఖాన్ కేసులో సూరజ్‌ అండగా సల్మాన్

    నా కూతురు జియా ఖాన్ మృతి కేసులో సూరజ్ పంచోలికి అండగా నిలిచారు. నిందితుడికి శిక్ష పడకుండా కేసును తారుమారు చేయించాడు. దర్యాప్తు, విచారణను నిలిపివేసేలా, నామమాత్రంగా కొనసాగేలా సల్మాన్ ఖాన్ తన పరపతిని, పవర్‌ను ఉపయోగించాడు. కేవలం ఆదిత్య పంచోలి కుటుంబాన్ని రక్షించడానికి శాయశక్తులా ప్రయత్నించారు అని జియా ఖాన్ తల్లి ఆరోపించారు.

    కేసులో బలమైన ఆధారాలు

    కేసులో బలమైన ఆధారాలు

    2015లో నా కూతురు జియా ఖాన్ మృతి కేసు విషయం గురించి చర్చించాలని ఓ సీబీఐ ఆఫీసర్ నాకు ఫోన్ చేస్తే నేను లండన్ నుంచి వచ్చాను. నేరానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి. కేసు బలంగా ఉందని చెప్పారు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ జోక్యం చేసుకొన్నారు.

    రోజూ సల్మాన్ ఫోన్ చేసి..

    రోజూ సల్మాన్ ఫోన్ చేసి..

    ప్రతీ రోజు సల్మాన్ ఖాన్ నాకు కాల్ చేసేవారు. సూరజ్‌పై చాలా డబ్బు ఇన్వెస్ట్ చేశాను. దయచేసి అతడిని వేధించవద్దు. పోలీసులు విచారించకుండా చూడు. అతడికి ఏం కాకుండా చూసే బాధ్యత నీదే. దానికి మనం ఏం చేద్దామో చెప్పండి మేడమ్ అంటూ సల్మాన్ అనేవారు. ఆ సమయంలో సల్మాన్ చాలా ఫ్రస్టేషన్‌లో, టెన్షన్‌లో ఉన్నట్టు కనిపించారు. దాంతో నేను ఈ కేసు విషయాన్ని ఢిల్లీలో సీబీఐ ఆఫీసర్ వద్దకు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాను అని జియా ఖాన్ తల్లి ఆరోపించారు.

    డబ్బు, పవర్ ఉపయోగించి

    డబ్బు, పవర్ ఉపయోగించి

    బాలీవుడ్‌లో డబ్బు, పవర్‌ను ఉపయోగించి ఇలా హత్యకేసులను దారి మళ్లిస్తారు. కేసుల్లో సాక్ష్యాలను, తీర్పులను మార్పిడి చేసే కుట్రలు జరుగుతాయనే విషయం అప్పట్లో అర్ధం కాలేదు. బాలీవుడ్‌లో విష సంస్కృతిపై ఎదురించడం, పక్కదారి పట్టడం, ఎవరిని కలిస్తే న్యాయం జరుగుతుందనే విషయం నాకు అప్పట్లో తెలియకపోలేదు అని జియా ఖాన్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

    జియా ఖాన్ సూసైడ్

    జియా ఖాన్ సూసైడ్

    యువ హీరోయిన్ జియా ఖాన్ 2013 జూన్‌లో ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. ఆ ఘటన బాలీవుడ్ ప్రపంచంలో ప్రకంపనాలు సృష్టించింది. జియా ఖాన్ మృతి నేపథ్యంలో సూసైడ్‌కు ప్రేరేపించారనే ఆరోపణలపై సూరజ్ పంచోలిపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం కేసు ఫైల్ చేయడం తెలిసిందే.

    English summary
    Jiah Khan mother fires on Salman Khan over involvement to save Sooraj Pancholi. Jiah Khan’s mother, Rabia Amin told that Salman looked frustrated and he was annoyed to save Sooraj, So I took the matter to Delhi to the higher CBI officers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X