వైరల్‌గా ప్రముఖ నటుడి మరణవార్త.. ఇబ్బందుల్లో పడిన ఎన్టీఆర్ బయోపిక్ యాక్టర్
Recommended Video
సోషల్ మీడియా వేగం పుంజుకొన్న తర్వాత ప్రముఖుల మరణాలపై నకిలీ వార్తలు చెలరేగిపోతున్నారు. గతంలో అమితాబ్ లాంటి ప్రముఖులు ఇకలేరు అంటూ రావడం, ఆ తర్వాత వారు స్వయంగా స్పందించడంలోపే కొంత గందరగోళం జరిగిపోయింది. తాజాగా నకిలీ మరణ వార్తకు ప్రముఖ నటుడు విక్టర్ బెనర్జీ బలైపోయాడు. అయితే ఈ వార్త మరో ప్రముఖ నటుడు, ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించిన జిష్ఫు సేన్ గుప్తాకు సంబంధించిన ట్విట్టర్ ఎకౌంట్ నుంచి వార్త బయటకు పొక్కడంతో తీవ్ర గందరగోళానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే..

జిష్ఫు సేన్ గుప్తా అకౌంట్ నుంచి
జిష్ఫు ఎంటర్‌టైన్‌మెంట్ అనే ట్వీట్టర్ ఎకౌంట్ ద్వారా విక్టర్ బెనర్జీ మరణవార్త బయటకు వచ్చింది. దాంతో బెంగాల్ సినీ పరిశ్రమను ఈ వార్త కుదిపేసింది. తన అకౌంట్ నుంచి వార్త బయటకు వచ్చారనే విషయం తెలిసి ప్రముఖ నటుడు జిష్షు సేన్ గుప్తా స్పందించాడు. విక్టర్ బెనర్జీ బతికే ఉన్నాడు.. అతనికి ఆరోగ్యానికి ముప్పేమిలేదు అని పేర్కొన్నాడు.
అది నా అకౌంట్ కాదు
జిష్షు ఎంటర్‌టైన్‌మెంట్ నాకు సంబంధించిన అకౌంట్ కాదు. అది నకిలీ అకౌంట్. ఆ అకౌంట్ నుంచి ఎలాంటి వార్త వచ్చినా నమ్మకూడదు. ఆ అకౌంట్ నా వెరిఫైడ్ అకౌంట్ కాదు అని జిష్షు సేన్ గుప్తా వెల్లడించారు. అంతేకాకుండా విక్టర్ బెనర్జీ మరణ వార్త ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చారు.

నకిలీ మరణవార్తపై స్పందన
విక్టర్ బెనర్జీ నకిలీ మరణవార్తపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. మా నాన్న గారు బతికే ఉన్నారు. ఆయన మరణ వార్త ఫేక్. నాన్న ఆరోగ్యం బాగుంది. ప్రస్తుతం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు అని కూతురు కేయా బెనర్జీ మీడియాకు వెల్లడించారు. నాన్న విక్టర్ బెనర్జీ అనారోగ్యంపై వచ్చే ఎలాంటి వార్తలు నమ్మకండి అంటూ సూచించారు.

యాక్టర్ విక్టర్ బెనర్జీ కెరీర్ గురించి
విక్టర్ బెనర్జీ కెరీర్ విషయానికి వస్తే, తాజాగా కంచనగంగ అనే అస్సామీ చిత్రంలో నటించారు. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. హిందీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో కాకుండా ఆంగ్ల చిత్రాల్లోనూ నటించారు. సత్యజిత్ రే, మృణాల్ సేన్, శ్యాం బెనగల్, రాంగోపాల్ వర్మ, రోమన్ పోలాస్కీ లాంటి దర్శకులతో పనిచేశారు. హిందీలో బర్ఫీ, ఏ పాసెజ్ టు ఇండియా, తా రా రమ్ పమ్, భూత్, గుండే చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











