twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగోడికి అండగా బాలీవుడ్ స్టార్ హీరో.. మరో బంపర్ ఆఫర్!

    |

    ఈ మధ్య కాలంలో హీరోలు ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చాలా మంది హీరోలు ప్రొడక్షన్ హౌస్ లు పెట్టి మరీ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇది అన్ని బాషల హీరోలు ఫాలో అవుతున్న హిట్ ఫార్ములా. ఇప్పటికే తెలుగులో చాలా మంది హీరోలు సొంతగా ప్రొడక్షన్ హౌస్ లు ఏర్పాటు చేసి మరీ కొంతమంది తమ సినిమాల నిర్మించుకుంటే మరి కొంతమంది ఇతరులను హీరోలుగా పెట్టి కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇదే కోవలో బాలీవుడ్ నటుడు జాన్‌ అబ్రహం ఓ వైపు కథానాయకుడిగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ రాణిస్తున్నారు.

    జేఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ఏర్పాటు చేసి 'విక్కీ డోనర్‌', 'మద్రాస్‌ కేఫ్‌' వంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన జాన్‌ 'తార వర్సెస్‌ బిలాల్‌'అనే సినిమాని కూడా నిర్మిస్తున్నారు. ఈ మేరకు ఈ మధ్య అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాలో హీరోగా తెలుగు నట్డికి ఛాన్స్ ఇచ్చిన ఆయన ఇప్పుడు అదే నటుడికి మరో బంపర్ ఆఫర్ ఇప్పించారట. ఆ వివరాల్లోకి వెళ్తే...

    మొన్ననే ఒక సినిమా అనౌన్స్మెంట్

    మొన్ననే ఒక సినిమా అనౌన్స్మెంట్

    తార వర్సెస్‌ బిలాల్‌ అనే సినిమాలో హర్షవర్ధన్‌ రాణే, అంగిర ధార్‌ హీరో హీరోయిన్స్ గా నటించనున్నారు. తాజాగా ఈ సినిమా గురించి జాన్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ 'తార వర్సెస్‌ బిలాల్‌' అనే సినిమాని నిర్మిస్తున్నామని ఇదొక అందమైన జీవిత కథ. హర్షవర్ధన్‌, అంగిర ధార్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను ఈ నెల లేదా మే నెలలో ప్రారంభిచనున్నామని ఆయన అన్నారు. ఇక ఈ సినిమాకి సమర్‌ షేక్ దర్శకత్వం వహించనున్నారు. అయితే తాజాగా తెలుగు నటుడు అయిన హర్షవర్ధన్‌ రాణేకి మరో బంపర్ ఆఫర్ తగిలేలా చేశాడు జాన్ అబ్రహం.

    ఇప్పుడు మరో సినిమాకి రిఫరెన్స్

    ఇప్పుడు మరో సినిమాకి రిఫరెన్స్

    యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ ఒకదానిలో హర్షవర్ధన్ ఎంపిక అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాని నీలేష్ సహాయ్ నిర్మించానున్నారని తెలుస్తోంది. మధ్యలో జాన్ కూడా నిర్మాతగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నీలేష్ సహాయ్ ప్రస్తుతం స్క్వాడ్ - రింజింగ్ డెంజోంగ్పా లాంచ్ ప్యాడ్ పోస్ట్ ప్రొడక్షన్‌ లో బిజీగా ఉన్నాడు. జాన్ అబ్రహం ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, "నీలేష్ సహాయ్ స్టైల్ అర్థం చేసుకునేవారు చాలా తక్కువ. నేను స్క్వాడ్ లో పార్ట్స్ చూశాను, ఆయన ఏదైతే ప్రామిస్ చేశాడో, అదే డెలివర్ చేశాడు. అందుకే నేను హర్ష్‌ ను సూచించానని చెప్పుకొచ్చారు. హర్షవర్ధన్ కి యాక్షన్ జానర్‌ కరెక్ట్ గా సూట్ అవుతుందని ఆయన చెప్పుకొచ్చాడు.

    కరెక్ట్ గా సూట్ అవుతాడట

    కరెక్ట్ గా సూట్ అవుతాడట

    ఈ సినిమా డిసెంబర్ నెలలో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. నీలేష్ సహాయ్ ఈ విషయం మీద మాట్లాడుతూ జాన్ యాక్షన్ కి చాలా మంది అభిమానులు ఉన్నారని, అందుకే ఈ విషయంలో నేను ఆయన సలహాలను చాలా సీరియస్‌గా తీసుకుంటానని చెప్పుకొచ్చారు. నేను రాణేతో ఇంటరాక్ట్ అయ్యాను మా సినిమాకి ఆయన పర్ఫెక్ట్ అని పేర్కొన్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకి దర్శకత్వం వహించడానికి వేరే ఎవరినా వస్తారా, నేనే దర్శకత్వం వహిస్తానా అనేది ఖచ్చితంగా చెప్పలేనని ఆయన చెప్పుకొచ్చారు.

    తెలుగు కలిసిరాలేదా

    తెలుగు కలిసిరాలేదా

    ఇక తకిట తకిట సినిమాతో తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన హర్షవర్ధన్ అవును, అవును 2, ఫిదా లాంటి సినిమాల్లో కూడా నటించారు. కానీ ఆయనకు ఇక్కడ అనుకున్నంత గుర్తింపు లభించలేదు. 2016 లో సనం తేరీ కసం సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అయన అక్కడ సత్తా చాటుతున్నాడు. వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళుతున్నాడు..

    English summary
    As we all know John Abraham and Bhushan Kumar are teaming up to produce a film featuring Harshvardhan Rane in lead. Recently John has helped Harshvardhan to bag another film. this action-packed thriller with Nilesh Sahay slated to go on floors by this december.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X