ప్రభాస్ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్: ‘సలార్’ కోసం కాదు.. ‘ఆదిపురుష్’లో కీలక పాత్ర

దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపించాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ క్రమంలోనే ఇప్పుడు అతడు నేరుగా హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ సినిమానే 'ఆదిపురుష్'. ఈ సినిమా రామాయణం నాటి కథతో రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇది చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. సీతగా కృతీ సనన్, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను చేస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆదిపురుష్'లో మరో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం కీలక పాత్రను పోషిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బీ టౌన్‌లో తెగ వైరల్ అవుతోంది. కాసేపే ఉండే ఈ పాత్రలో నటించేందుకు అతడు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ప్రభాస్ నటిస్తోన్న మరో చిత్రం 'సలార్'లో జాన్ అబ్రహం విలన్‌గా నటిస్తున్నాడని కూడా రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే, అతడిని సంప్రదించింది మాత్రం 'ఆదిపురుష్' యూనిట్ మాత్రమే అనే టాక్ కూడా వినిపిస్తోంది.

John Abraham Key Role in Prabhas Adipurush Movie

ప్రభాస్ కెరీర్‌లోనే తొలి చారిత్రక చిత్రంగా తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్'పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి అయింది. మిగిలిన భాగం కోసం ఈ మూవీ యూనిట్ హైదరాబాద్‌ రావాలని డిసైడ్ అయింది. అంతలో కరోనా సెకెండ్ వేవ్ కారణంగా చిత్రీకరణను వాయిదా వేశారు. ఇక, ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వండర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X