RC16: రామ్ చరణ్ మూవీలో బడా స్టార్.. తెలుగు సినిమా చేయను అన్నోడినే ఒప్పించాడుగా!
టాలీవుడ్‌లోకి బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా.. ఎవరూ ఊహించని రీతిలో తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు రామ్ చరణ్. కెరీర్ ఆరంభంలోనే భారీ హిట్లు కొట్టిన అతడు.. ఈ మధ్య కాలంలోనూ వరుసగా విజయాలను అందుకుంటున్నాడు. దీనికితోడు RRR తర్వాత గ్లోబల్ స్టార్ అన్న పేరును తెచ్చుకున్నాడు. దీంతో మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాడు.
ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇక, ఈ సినిమా పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సనతో చేస్తున్నట్లు ప్రకటించాడు.

రామ్ చరణ్ - బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా క్రీడా నేపథ్యంతో రాబోతుందని సమాచారం లీకైంది. అంతేకాదు, ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నాడని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. చరణ్.. 'గేమ్ చేంజర్' సినిమాను పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనున్న ఈ సినిమాలో ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్లు భాగం కాబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, శివ రాజ్‌కుమార్ సహా ఎంతో మందిని ఫైనల్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోను కూడా ఎంపిక చేసుకున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉండే ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహంను తీసుకున్నారని తెలిసింది. ఇందులో అతడి రోల్ ఎంతో వైవిధ్యంగా ఉంటుందట. ఇది పక్కన పెడితే గతంలో జాన్ అబ్రహం తెలుగులో సినిమా చేయనని చెప్పాడు. అలాంటి వాడినే రామ్ చరణ్ సినిమా కోసం ఒప్పించారని పలువురు చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. క్రేజీ కలయికలో రాబోయే ఈ సినిమా దాదాపు రూ. 400 కోట్లు బడ్జెట్‌తో రూపొందనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











