బాలీవుడ్ సినిమాపై మోజు పడ్డ జాన్ విక్.. హలీవుడ్‌లో రీమేక్ కోసం భారీ ఆఫర్! ఆ సినిమా ఎంటో తెలుసా?

సినిమా ప్రపంచంలో సాధారణంగా హాలీవుడ్ సుంచి బాలీవుడ్ గానీ, ఇతర భాషల్లో గానీ కథను, సీన్లను కాపీ కొట్టడం జరుగుతుంటుంది. అయితే కాపీ కాదు.. స్పూర్తి పొందామని కొందరు సినీ ప్రముఖులు తమ వాదనను వినిపిస్తుంటారు. అయితే ఒరిజినల్‌గా ఓ బాలీవుడ్ సినిమాను రీమేక్ చేయడానికి సూపర్ స్టార్ జాన్ విక్, ఆయన నిర్మాత చాడ్ స్టాహెల్‌స్కీ ముందుకు రావడం ఇండియన్ సినిమా పరిశ్రమలో సంచలనంగానే చెప్పుకోవాలి. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..

ఓ వైపు దేశవ్యాప్తంగా కల్కి 2898 ఏడీ సినిమా సంచలన విజయం సాధిస్తుండగా.. మరో వైపు ఎలాంటి అంచనాలు, సౌండ్ లేకుండా జూలై 5వ తేదీన రిలీజైన కిల్ చిత్రం బాక్సాఫీస్ వద్దనే కాకుండా సినీ క్రిటిక్స్, సాధారణ ప్రేక్షకుల నుంచి రీసౌండ్ చేస్తున్నది. ఈ సినిమాకు పాజిటివ్‌గా రివ్యూలు రావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.

John Wick to remake Bollywood film Kill into Hollywood Here Is the news

కిల్ (Kill) మూవీ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో లక్ష్య, రాఘవ్ జుయల్, తన్యా మాణిక్‌తలా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. నిఖిల్ నాగేశ్ భట్ అనే దర్శకుడి రూపొందించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ తన సొంత బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్‌తోపాటు సిక్యా ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించింది.

కిల్ సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాత, దర్శకులకు ఊహించని వార్త అందింది. ఈ సినిమాను హాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి ప్రముఖ నటుడు జాన్ విక్, దర్శకుడు చాడ్ స్టాహెల్‌స్కీ భారీ ఆఫర్ ఇచ్చారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఏంటీ ఈ సినిమా అనే అందరిలో ఆసక్తిని పెంచింది.

John Wick to remake Bollywood film Kill into Hollywood Here Is the news

కిల్ సినిమాకు వస్తున్న స్పందన గురించి నిఖిల్ నాగేశ్ భట్ మాట్లాడుతూ.. ఈ సినిమాను తొలుత టొరంటోలోని ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించాం. దాదాపు ఈ సినిమాను చూడటానికి 1100 మంది వచ్చారు. తొలి 20 నిమిషాలు చూడటానికి ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. కానీ ఆ తర్వాత ప్రేక్షకుల రియాక్ట్ అయిన తీరు చూసి.. ఈ సినిమా అందరికి నచ్చుతుందనే విశ్వాసం పెరిగింది అని అన్నారు.

More from Filmibeat

Read more about: kill john wick
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X