రైతుగా మారిన సల్మాన్ ఖాన్... ట్రాక్టర్ ఎక్కి రంగంలోకి దిగిన భాయ్ జాన్
ఇటీవలే ఒంటినిండా మట్టి పూసుకున్న ఫొటోను షేర్ చేస్తూ, రైతులకు జోహార్లు అంటూ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సంగతి తెలసిందే. అయితే, అసలు విషయాన్ని పక్కన పెట్టిన నెటిజెన్లు, మాములుగానే తమదైన ధోరణిలో సల్మాన్ మంచి ఆలోచనపై బురద చల్లే ప్రయత్నం చేశారు. ఇక మేమ్ లకైతే ఢోఖానే లేదు. కానీ, వీటిని ఏమాత్రం సీరియస్ గా తీసుకోని భాయ్ జాన్ మాత్రం, తన పనిలో పూర్తిగా నిమగ్నమైపోయాడు.
ఒంటికి మట్టి పూసుకోవడమే కాదు, కావాలంటే నిజంగానే సేద్యం చేసి చూపిస్తానంటూ, ఈ సారి ఏకంగా ట్రాక్టర్ ఎక్కి భూమిని దున్నేస్తున్న వీడియోను షేర్ చేశాడు సల్మాన్ భాయ్. ఏదో సరదాకి ట్రాక్టర్ ఎక్కి చక్కర్లు కొట్టాడులే అని అనుకోవడానికి వీలు లేకుండా, మట్టిలో దిగి భూమి సారం పరిశీలిస్తున్న షాట్స్ ను కూడా షేర్ చేశాడు. దీంతో ఇప్పటివరకూ సల్మాన్ కటింగ్ లు ఇస్తున్నాడు అంటూ కామెంట్ చేసినవారందరి నోళ్లూ మూతపడ్డాయనే చెప్పుకోవచ్చు.

లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి తన పాన్వెల్ ఫార్మ్ హౌస్ దాటి రాని సల్మాన్ ఖాన్, అక్కడి నుంచే అని పనులూ చెక్కబెట్టేస్తున్న వైనం తెలిసిందే. లాక్ డౌన్ లోనే రెండు పాటలు రిలీజ్ చేసి వాహ్వా అనిపించుకున్న భాయ్ జాన్, ఇప్పుడు సేద్యంలో ఆరితేరేందుకు సిద్ధమయ్యాడు. మరి.. బాలీవుడ్ బాక్సాఫీస్ పై ఆధిపత్యం చలాయిస్తున్న ఈ సల్మాన్, సేద్యంలోనూ అదే రేంజ్ లో దున్నేస్తాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications











