ఎన్టీఆర్ మూవీ కోసం కొత్త టెక్నాలజీ.. ఆ సీన్స్ కోసం ఇండియాలోనే తొలిసారిగా!
గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. అదే సమయంలో టాలీవుడ్‌లోని హీరోల రేంజ్ కూడా దేశాలు దాటిపోతోంది. ముఖ్యంగా కొందరు అయితే పాన్ ఇండియా స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. అందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఇప్పటికే నేషనల్ క్రేజ్ తెచ్చుకున్న అతడు.. ఇప్పుడు వరుస చిత్రాలతో సత్తా చాటుతున్నాడు.
వరుసగా హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు 'దేవర' మూవీని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే అతడు.. బాలీవుడ్‌లో నేరుగా 'వార్ 2' అనే సినిమాను లైన్‌లో పెట్టుకున్నాడు. ఇందులో అతడు హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. గతంలో వచ్చి హిట్ అయిన 'వార్' మూవీకి ఇది సీక్వెల్‌గా రాబోతుంది.

జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబోలో రాబోతున్న 'వార్ 2' మూవీని 'బ్రహ్మాస్త్ర' ఫేం అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అంతేకాదు, ఓ టెస్ట్ షూట్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఆ వెంటనే ఫారెన్ కంట్రీస్‌లో కొన్ని క్రేజీ షెడ్యూళ్లను కూడా జరిపించిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా రేంజ్ హీరోలు కలిసి చేస్తున్న 'వార్ 2' మూవీకి సంబంధించిన ప్రధానమైన షూటింగ్ పార్టును మరికొద్ది రోజుల్లోనే ప్రారంభించబోతున్నారు. అందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లపై కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్న కొత్త టెక్నాలజీ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.

'వార్ 2' మూవీ కోసం చిత్ర యూనిట్ మోషన్ టెక్నాలజీని వాడుతుందట. ఈ చిత్రంలో ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయి. వీటి కోసం హీరోల బాడీ డబుల్స్ (డూప్‌లు)ను పెట్టుకుంటారు. వాళ్లను గుర్తు పట్టకుండా ఉండడంతో పాటు సేమ్ ఎన్టీఆర్, హృతిక్ ముఖాల్లా కనిపించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందట. గతంలో ఏ ఇండియన్ మూవీలోనూ దీన్ని వాడలేదని అంటున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న 'వార్ 2' మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రం కోసం సదరు సంస్థ దాదాపు రూ. 300 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్లు కూడా తెలిసింది. ఈ చిత్రాన్ని 2025 ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











