War 2 ఊహించని పాత్రతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ.. లీకైన యంగ్ టైగర్ రోల్!

జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర చేసినా కూడా ట్రెండ్ సెట్ చేసేలా ఉంటుంది. దర్శకులు ఊహించుకున్న దాని కంటే పాత్రలకు ఎక్కువ స్థాయిలో న్యాయం చేయగల అతికొద్ది మంది హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ప్రస్తుతం ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న చాలామంది యువ హీరోలు కూడా ఎన్టీఆర్ స్పూర్తిగా తీసుకుంటున్నట్లు చెబుతూ ఉంటారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఎప్పుడు లేనివిధంగా మొదటి సారి ఊహించని పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్లో మొదటి సినిమా చేయబోతుండగా అందులో ఎన్టీఆర్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందట. కానీ ఇప్పుడు లీకైన సమాచారాన్ని బట్టి ఫాన్స్ లో అయితే కొంత ఆందోళన కలిగిస్తోంది ఆ వివరాల్లోకి వెళితే..

Jr NTR unexpected character in bollywood movie war 2 latest leak

ఫ్యాన్స్ లో నమ్మకం: RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో పవర్ఫుల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

దర్శకుడు కొరటాల శివ ఇంతకుముందే ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ కూడా ఈ సినిమాపై అంచనాలు అయితే ఏమాత్రం తగ్గలేదు. తప్పకుండా ఈ సినిమా తో అతను సక్సెస్ అందుకుంటాడు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు.

Jr NTR unexpected character in bollywood movie war 2 latest leak

వార్ 2 సినిమాలో పవర్ఫుల్ రోల్: అయితే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో పాటు త్వరలోనే మరొక సినిమా షూటింగ్లో కూడా భాగం కాబోతున్నట్లుగా గత కొంతకాలంగానే కరకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో ఆఫర్ వచ్చింది అని బాలీవుడ్ మీడియాలో కూడా బాగానే ప్రచారాలు కొనసాగుతున్నాయి. దాదాపు ఎన్టీఆర్ రోల్ ఫిక్స్ అయింది అని త్వరలోనే అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

Jr NTR unexpected character in bollywood movie war 2 latest leak

హృతిక్ రోషన్ కు ధీటుగా: యష్ రాజ్ రాజ్ ఫిలిమ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే వార్ 2 సినిమాలో మునుపటిలానే మెయిన్ హీరోగా హృతిక్ రోషన్ అయితే కనిపించబోతున్నాడు. అయితే ఇంతకు ముందుకు మొదటి భాగంలో టైగర్ షాప్ అతనికి సపోర్టింగ్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మరింత పవర్ఫుల్ పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.

Jr NTR unexpected character in bollywood movie war 2 latest leak

నెగిటివ్ షేడ్ ఉన్న విలన్ రోల్?: లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అయితే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. గతంలో ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా పెద్దగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు చేసింది లేదు. కానీ ఇప్పుడు మాత్రం అతను చాలా విలనిజాన్ని చూపించాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, ఎన్టీఆర్ కు ఆ పాత్ర గురించి చాలా క్లారిటీగా వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Jr NTR unexpected character in bollywood movie war 2 latest leak

షూటింగ్ ఎప్పుడంటే: వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా కనిపించబోతున్నాడు అనే టాక్ రాగానే ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ లో కొంత ఆందోళన అయితే కలుగుతుంది. ఇప్పటికి RRR సినిమాలో పాత్రకు సంబంధించి కాస్త అసహనంతో ఉన్న ఫ్యాన్స్ ఇప్పుడు వార్ 2 సినిమాలో విలన్ పాత్ర అంటే ఏమాత్రం కరెక్ట్ కాదు అనే ఫీల్ అవుతున్నారు. ఇక డిసెంబర్లో మొదలయ్యే ఒక షెడ్యూల్ షూట్ లో ఎన్టీఆర్ పాల్గొనే అవకాశం ఉందట. మరి ఆ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X