Devara Day 9 Collections : దేవరకి దెబ్బేసిన ఆ మార్కెట్.. ఎన్టీఆర్ మూవీకి 9 రోజు ఎన్ని కోట్లంటే?
జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. సెప్టెంబర్ 27న రిలీజైన ఈ సినిమా తొలి వారం ముగిసే సరికే నిర్మాతను ఒడ్డునపడేసింది. బ్రేక్ ఈవెన్ పనిపట్టిన దేవర రూ.500 కోట్ల టార్గెట్ దిశగా దూసుకెళ్తోంది. ఏపీ, తెలంగాణ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు ఎన్టీఆర్. మరి 9వ రోజు దేవర ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు రాబట్టాడు.. ఏయే చోట్ల కొత్త రికార్డులు నెలకొల్పాడో చూస్తే :
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషించారు. జనతా గ్యారేజ్ తర్వాత రెండోసారి కొరటాల శివతో జతకట్టాడు. ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ తనను తాను నిరూపించుకోవాలనే కసితో ఈ సినిమాను తెరకెక్కించారు. దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు సంయుక్తంగా నిర్మించారు.

టీజర్, ట్రైలర్ , పాటలతో విపరీతంగా హైప్ రావడంతో దేవరకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. నైజాంలో రూ.44 కోట్లు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, ఆంధ్రాలో రూ.46.55 కోట్లు కలిపి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటకలో రూ.16 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ. కోటి, ఓవర్సీస్‌లో రూ.27 కోట్లు , ఇండియా వైడ్ రూ.20 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ.182.55 కోట్ల బిజినెస్ జరిగింది.
దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తో దేవర బరిలో దిగింది దేవర. మొదటి రోజు రూ.172 కోట్లు, రెండో రోజు రూ.71 కోట్లు, మూడో రోజు రూ. 40 కోట్లు, నాలుగో రోజు రూ. 25 కోట్లు, ఐదో రోజు రూ.40కోట్లు, ఆరో రోజు రూ.40 కోట్లు, ఏడో రోజు రూ.20 కోట్లు, ఎనిమిదో రోజు రూ.13 కోట్ల వసూళ్లను సాధించింది. మరి తొమ్మిది రోజుల్లో దేవర ఎన్ని కోట్లు సాధించిందో పరిశీలిస్తే

వీకెండ్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో బాగానే బుకింగ్స్ జరిగాయి. 9వ రోజు ఏపీ, తెలంగాణలలో దేవర రూ.7 కోట్లు , హిందీలో రూ.3 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ కలుపుకుని రూ. 2 కోట్ల కలెక్షన్లు సాధించింది. మొత్తంగా 9వ రోజు దేవర ప్రపంచవ్యాప్తంగా రూ. 12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అంతా బాగానే ఉంది కానీ తమిళ్ నుంచి వసూళ్లు పడిపోవడం దేవర యూనిట్‌ను ఇబ్బంది పెడుతోంది. ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పినా.. చెన్నై వెళ్ళి ఇంటర్య్యూలు ఇచ్చాడు. కానీ ఫలితం మాత్రం శూన్యం. దేవర ఈ 9 రోజుల్లో తమిళనాడులో తెలుగు, తమిళ్ వెర్షన్‌లు కలిపి కేవలం రూ.4 కోట్ల షేర్‌ను మాత్రమే అందుకుంది. ఈ నేపథ్యంలో తెలుగు నుంచి రానున్న పాన్ ఇండియా మూవీస్‌ను తమిళ తంబీలు ఎలా ఆదరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











