Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నా రొమాంటిక్ సీన్స్ గురించి నా కొడుకు అడిగిన ప్రశ్నలకు షాక్ అయ్యా: సీనియర్ హీరోయిన్
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు క్యూట్ అండ్ లవ్లీ రొమాంటిక్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న హీరోయిన్ జూహీ చావ్లా. 90ల కాలంలో ఆమె చాలా బిజీగా ఉండేవారు. దాదాపు 10ఏళ్ల పాటు ఎదురులేని స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో చక్రం తిప్పారు. ఇక జూహీ చావ్లా కేవలం బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా కొన్ని రొమాంటిక్ సినిమాలు చేశారు. అయితే ఆమె రొమాంటిక్ సినిమాలపై ఆమె పిల్లలు అడిగిన ప్రశ్నలకు ఒకసారి ఆశ్చర్యపోయారట.
తెలుగులో మూడు సినిమాలు
1993 లో వచ్చిన 'హమ్ హైన్ రాహి ప్యార్ కే' చిత్రంతో జూహీ చావ్లా కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. కృష, రమేష్ బాబు నటించిన కలియుగ కర్ణుడు సినిమా ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఇక ఆ తరువాత విక్కీ దాదా, శాంతి క్రాంతి అనే సినిమాలలో నాగార్జునకు జోడిగా నటించింది. ఇక ఆ తరువాత జూహీ బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్యాప్ లేకుండా ఆఫర్స్ అందుకొని బిజీ హీరోయిన్ గా నటించింది.
అందులో రొమాంటిక్ సీన్స్ ఉంటాయా?
ఇక ఆమె రొమాంటిక్ సినిమాలు నేటితరం ఆడియెన్స్ ని కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ఆమె సినిమాలను చూసే ముందు పిల్లలు అడిగే ప్రశ్నలకు జూహీ చావ్లా ఆశ్చర్యపోతుందట. ముఖ్యంగా నా కుమారుడు అర్జున్ సినిమా చూడకముందే అందులో రొమాంటిక్ సీన్స్ ఉంటాయా? అని అడుగుతాడాని, అలా నిన్ను చూడటం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని డైరెక్ట్ గా చేబుతాడని తెలిపింది.
నా పిల్లలు నా సినిమాలు చూడరు
ఇటీవల ఒక బాలీవుడ్ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జూహీ మాట్లాడుతూ.. నా పిల్లలు జాహ్నవి, అర్జున్ లను 'హమ్ హైన్ రాహి ప్యార్ కే' చూడమని నా భర్త చాలా సార్ల ఒప్పించటానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు నిరాకరించారు. వాస్తవానికి, వారు నా సినిమాలు చూడటానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. నా భర్త (జే మెహతా) హమ్ హైన్ రాహి ప్యార్ కే చూడమని చెప్పాడు. అది చాలా అందమైన చిత్రం అని వారికి వివరణ ఇచ్చారు.
ఆ చిత్రంలో రొమాన్స్ ఉందా?
నా భర్త చూడమని అన్నప్పుడు తనయుడు అర్జున్ నన్ను ఒకటి అడిగారు," అమ్మ ఆ చిత్రంలో రొమాన్స్ ఉందా? అని అడగడంతో నేను, 'అవును, ఇది రొమాంటిక్ కామెడీ అని చెప్పాను. దీంతో తను, మీరు చేసిన 'రొమాన్స్ సినిమాలను చూడటం ఇష్టం లేదు. ఇది చాలా వింతగా అనిపించవచ్చు. కానీ, నేను మీ సినిమాలు ఏవీ చూడను.' అంతే! అని డైరెక్ట్ గా ఆన్సార్ ఇచ్చాడు. ఆ సమాధానం విన్న నేను ఆశ్చర్యపోయా.
Recommended Video
ఆ సినిమాలాంటెనే వారికి ఇష్టం
నా పిల్లలు నా సినిమాలు ఏవీ చూడటానికి ఇష్టపడరు. ఇక కృష్ణ హూన్, చాక్ ఎన్ డస్టర్ సినిమాలు మాత్రమే వాళ్లకు చాలా ఇష్టం. మిగతా సినిమాలన్ని కూడా వాళ్లకు అంతగా నచ్చవని జూహీ చావ్లా వివరణ ఇచ్చారు. జూహి చావ్లా ఇటీవల ఏక్ లడ్కి కో దేఖా తో ఐసా లగాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. సోనమ్ కపూర్, అనిల్ కపూర్, రాజ్ కుమార్ రావులతో కలిసి నటించి జూహీ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. ఇక నెక్స్ట్ ఈ సీనియర్ హీరోయిన్ పలు విభిన్నమైన వెబ్ సిరీస్ లతో బిజీ కానుంది.