twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    5G technologyకి వ్యతిరేకంగా జూహీ చావ్లా పిటిషన్.. పాటలు పాడుతూ విచారణను అడ్డుకొన్న అజ్ఞాత వ్యక్తి

    |

    పర్యావరణానికి, మానవ జాతి మనుగడకు ముప్పు అంటూ 5G టెక్నాలజీ వ్యతిరేకంగా బాలీవుడ్ హీరోయిన్ జూహీ చావ్లా పిటిషన్ దాఖలు చేయడం పారిశ్రామిక వర్గాల్లో సంచలనం రేపింది. జుహీ చావ్లా దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు జూన్ 2వ తేదీన విచారణను చేపట్టింది. ఈ కేసు విచారణ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తి అడ్డు తగలడం చర్చనీయాంశమైంది. సంచలన రీతిలో చర్చనీయాంశమైన ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి కోర్టులోకి ప్రవేశించి జుహీ చావ్లా నటించిన పాటలను పడుతూ నిబంధనలకు విరుద్దంగా వ్యవహారించడంపై కోర్టు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

    ఢిల్లీ కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో జూహీ, అమీర్ ఖాన్ నటించిన హమ్ హై రాహీ ప్యార్ కే చిత్రంలోని ఘూంఘట్‌ కి ఆద్ సే పాటను పాడటంతో ఒక్కసారిగా కోర్టులో కలకలం రేగింది. ఆ తర్వాత నాజయాజ్ చిత్రంలోని లాల్ హోటోపే పాటను అందుకొన్నాడు. దాంతో ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ జేఆర్ మిదా తీవ్రంగా మందలించినట్టు తెలిసింది. అయితే ప్రత్యర్థి పార్టీలు ఈ వ్యక్తిని పంపించి ఉంటారని, విచారణకు అడ్డు తగిలేందుకు కుట్ర పన్నారని జుహీ చావ్లా తరుఫు న్యాయవాది దీపక్ ఖోస్లా తెలిపారు. కోర్టు విచారణకు అడ్డు తగిలిన వ్యక్తి గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. ఈ ఉల్లంఘనకు పాల్పడినట్టు నోటీసులు పంపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    Chawlas 5G virtual hearing gets interrupted by an unidentified man

    మొబైల్, ఇంటర్నెట్ ఆధారిత సేవల రంగంలోకి 5G టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావడానికి మేము వ్యతిరేకం కాదు. ప్రపంచవ్యాప్తంగా వైర్‌లెస్ కమ్యూనికేషన్ రంగంలో వినియోగిస్తున్న టెక్నాలజీకి మేము వ్యతిరేకం. సెల్‌ఫోన్ నెట్‌వర్క్స్, వైర్‌లెస్ గాడ్జెట్స్ నుంచి వచ్చే రేడియో ఫ్రిక్వెన్సీ రేడియేషన్ ముప్పుపై జరిగిన పరిశోధనల ఫలితాలు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం భూ పర్యావరణంలో రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ 10x to 100x స్థితిలో ఉంది. 365 రోజులపాటు ఏ మొక్కకు, ఈ కీటకానికి, ఏ పక్షికి, ఏ జంతువుకు, ఏ వ్యక్తి ప్రాణాలకు హాని కలిగించకుండా ఈ 5G టెక్నాలజీని అమలు చేయడం గానీ, అందుబాటులోకి తీసుకురాగలమన్న హామీ ఇవ్వగలరా అని జుహీ చావ్లా ప్రశ్నిస్తూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

    English summary
    Bollywood actress Juhi Chawla petition aganist 5G technology in Delhi High court. She shown many researches warns this technology which is harmful to environment and people. She has shown concern about RF Radiation. This petition come to court bench on June 2nd. But Juhi Chawla's 5G virtual hearing gets interrupted by an unidentified man
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X