ఆల్రెడీ డైరెక్టర్ ఔట్: ఇపుడు సినిమా సెట్స్‌లో లైంగిక వేధింపులు, పోలీస్ కేసు నమోదు...

బాలీవుడ్లో తెరకెక్కుతున్న 'హౌస్ ఫుల్ 4' సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. సినిమా సెట్లోనే జూనియర్ ఆర్టిస్టు మీద కొందరు సభ్యులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇప్పటికే #మీటూ ఉద్యమంలో భాగంగా పలువురు యాక్టర్లు ఈ చిత్ర దర్శకుడు సాజిద్ ఖాన్ తమను లైంగిక వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కోవడంతో దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. మరో వైపు నటుడు నానా పాటేకర్ మీద సైతం వేధింపుల ఆరోపణలు రావడంతో ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నారు.

ఇపుడు ఏకంగా 'హౌస్‌ఫుల్ 4' సినిమా సెట్లోనే జూనియర్ ఆర్టిస్టు మీద లైంగిక వేధింపులు జరుగడం చర్చనీయాంశం అయింది.

ఆ ఇద్దరు..మరో నలుగురుతో కలిసి

ఆ ఇద్దరు..మరో నలుగురుతో కలిసి

గురువారం రాత్రి ‘హౌస్‌ఫుల్ 4' మూవీ సెట్లో బాధితురాలు తన కొలీగ్‌తో కలిసి సెట్స్‌లో కూర్చుని ఉండగా పవన్ శెట్టి, సాగర్ అనే ఇద్దరు వ్యక్తులు మరో నలుగురితో కలిసి వచ్చి ఆమె స్నేహితురాలితో మిస్ బిహేవింగ్ చేయడం మొదలు పెట్టారు.

అడ్డకున్నందుకు ఆమె ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశారు

అడ్డకున్నందుకు ఆమె ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశారు

సదరు వ్యక్తులు వచ్చిన తన స్నేహితురాలిని ఇబ్బంది పెడుతుంటే ఆమె(బాధితురాలు) అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారంతా కలిసి ఆమెపై దాడి చేశారు. ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసి అసభ్యంగా ప్రవర్తించారు.

అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్ సెట్స్‌లో లేరు

అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్ సెట్స్‌లో లేరు

సంఘటన సమయంలో ప్రొడక్షన్ ప్రముఖులతో స్టార్స్ అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్ బయటకు వెళ్లారు. ఎవరికి చెప్పాలో అర్థం కాలేదని, అందుకే పోలీసులకు కాల్ చేసినట్లు బాధితురాలు తెలిపింది. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారు పరుగెత్తుకుంటూ వెళ్లడం ప్రొడక్షన్లో అందరూ చూశారని బాధితురాలు తెలిపింది.

ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన పోలీసులు

ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన పోలీసులు

ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటనతో మరోసారి ‘హౌస్ ఫుల్ 4' మూవీ హాట్ టాపిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X