టిక్ టాక్ బేబీకి ఝలక్.. సర్జరీ చేయించుకొన్నావా?.. నీవు ఎప్పుడైనా అంటూ ట్రోల్స్
మనిషిని పోలిన మనుషులు ఉండటం చాలా అరుదు. సినీ తారలను పోలి ఉంటే వారికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా టిక్‌టాక్ యాప్‌లో హల్‌చల్ చేస్తున్న అలీనా రాయ్ మాత్రం అచ్చు కత్రినా కైఫ్ మాదిరిగానే ఉంటుంది. అయితే కత్రినాకు జిరాక్స్ కాపీలా ఉన్న ఈ ముద్దుగుమ్మకు మాత్రం సోషల్ మీడియాలో క్రేజీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంతకు ఈ కత్రినా జూనియర్ ఎవరంటే..

టిక్ టాక్‌లో యమా యాక్టివ్‌గా
సోషల్ మీడియా యాప్ టిక్ టాక్‌లో యాక్టివ్‌గా ఉండే వాళ్లకు అలీనా రాయ్ గురించి బాగా తెలిసి ఉంటుంది. టిక్‌టాక్‌లో వీడియోలు, లైవ్ ప్రొగ్రామ్స్‌తో ఫన్నీగా, చలాకీగా కనిపిస్తుంటుంది. ఆమె వీడియోలకు విశేషంగా రెస్సాన్స్ ఉంటుంది. ఇక టిక్ టాక్ కాకుండా సోషల్ మీడియాలోని ఇతర వేదికలపై చురుకుగా ఉంటారు అలీనా.

ఇన్స్‌టాగ్రామ్‌లో లక్షల్లో ఫాలోయింగ్
అలీనా రాయ్‌కి ఇన్స్‌టాగ్రామ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా ఫాలోవర్స్ ఉన్నారు. దాదాపు ఆమెకు 33.5 లక్షల ఫాలోవర్స్ ఉండటం గమనార్హం. 2017లో ఇన్స్‌టాలోకి ప్రవేశించిన ఆమె తన వీడియోలతో విశేషంగా రాణిస్తున్నారు.

అలీనా నీవు ఎప్పుడైనా
అయితే కత్రినా మాదిరిగా ఉండటంతో ఆమెకు అలాంటి ప్రశ్నలే నెటిజన్ల నుంచి ఎదురవుతుంటాయి. అలీనా.. నీవు ఎప్పుడైనా కత్రినాను కలిశావా? ఆమె మాదిరిగా ఉన్నట్టు కత్రినాకు తెలుసా? అంటూ ఎక్కువ మంది ప్రశ్నలు అడుతుంటారు. ఇలాంటి ప్రశ్నలు అలీనాకు సర్వసాధారణంగా మారాయి.

ప్లాస్టిక్ సర్జరీపై ప్రశ్నలు
ఇక నెటిజన్లు ఓ అడుగు ముందేసి అలీనాను విసిగించే ప్రయత్నాలు చేస్తుంటారు. కత్రినా మాదిరిగా కనిపించడానికి సర్జరీలు ఏమైనా చేయించుకొన్నావా? ప్లాసిక్ సర్జరీల వల్లే అలా కనపడుతున్నావా? మీ కుటుంబంలో ఎవరైనా ఇలా గుర్తించారా?.. దేవుడా ఈమె సేమ్ టూ సేమ్ కత్రినా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతుండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











