సల్మాన్ కోసం రంగంలోకి మెగాస్టార్.. ముంబై టు హైదరాబాద్ షిఫ్టింగ్!

సల్మాన్ ఖాన్ హీరోగా కభీ ఈద్ కభీ దివాళీ సినిమా ఆరంభం నుంచి వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా సల్మాన్ ఖాన్ తో విభేదాలు నెలకొనడంతో దర్శకుడు ఫర్హాద్ సమ్జీ ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు ఈ సినిమా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆ వివరాలు

ఆగిపోయిందనుకున్నారు

ఆగిపోయిందనుకున్నారు

2021 అక్టోబర్ లో సల్మాన్ ఖాన్ తో కబీ ఈద్ కబీ దివాలీ సినిమా చేయబోతున్నట్లుగా నిర్మాత సాజిద్ నడియావాలా ఘనంగా ప్రకటించారు. ఫర్హాద్ సమ్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా సమసిపోతుందని అనుకున్నారు కానీ, ఆ సినిమా కరోనా కారణంగా షూటింగ్ దాకా కూడా వెళ్ళలేదు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి చాలా రోజుల పాటు సల్మాన్ ఖాన్ తో పాటు టీమ్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో సినిమా ఆగిపోయినట్లు కూడా భావించగా, అదేమీ లేదని సినిమా యూనిట్ ఖండించింది.

 రీ షూట్ చేయాలని

రీ షూట్ చేయాలని


అయితే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ మొదలయింది. షూటింగ్ మొదలైన మొదటి రోజు పొడవైన హైర్ తో కూడిన సల్మాన్ ఖాన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ మధ్యనే సల్మాన్ ఖాన్ తో పాటు నిర్మాతలతో ఏర్పడిన విభేదాల కారణంగా దర్శకుడు ఫర్హాద్ సమ్జీ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. ఫస్ట్ షెడ్యూల్ లో దర్శకుడు తెరకెక్కించిన సీన్స్ రషెస్ చూసిన సల్మాన్ అసంతృప్తిని వ్యక్తం చేసి, వాటిని మళ్లీ రీ షూట్ చేయాలని సూచించినట్లు తెలిసింది.

విలేజ్ సెట్ లో

విలేజ్ సెట్ లో


అయితే తన పనిని తప్పు పడుతూ సల్మాన్ మాట్లాడిన మాటలు విని కలత చెందిన ఫర్హాద్ షూటింగ్ కు రావడం మానేశారని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే ఫర్హాద్ స్థానంలో దర్శకత్వ బాధ్యతలను సల్మాన్ ఖాన్ చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ ఇక మీదట హైదరాబాద్ లో చేయబోతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆచార్య సినిమా కోసం కోకాపేటలో వేసిన 20 ఎకరాల విలేజ్ సెట్ లో షూటింగ్ జరిపే అవకాశం ఉందని అంటున్నారు.

ముంబైలోనే

ముంబైలోనే


ఈ సినిమా తెలుగులో వచ్చిన కాటంరాయుడు సినిమా రీమేక్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని అంటున్నారు. అంతేకాదు హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే ఆయనకు సోదరిగా కనిపించే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలోనే జరుగుతూ ఉండగా వచ్చే నెలలో హైదరాబాద్ కోకాపేటలో జరగబోతుంది.

 చిరంజీవి మాట సాయంతో

చిరంజీవి మాట సాయంతో


ఇక ఇప్పటికే సల్మాన్ ఖాన్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కోరిన వెంటనే నిర్మాతలతో మాట్లాడి చిరంజీవి సెట్ ను సల్మాన్ ఖాన్ కోసం అందించేందుకు మాట సాయం చేశారని అంటున్నారు. ఈ సినిమాను ముందు వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఈ ఏడాది డిసెంబరు 30నే సినిమాను రిలీజ్‌ చేస్తామని ఇటీవల సినిం యూనిట్ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X