సన్నీలియోన్‌ను నంబర్ అడగలేదు..ఇలాంటి జర్నలిజం సిగ్గుచేటు.. సీనియర్ నటుడు ఫైర్

ఒక్కోసారి వార్తలు మిస్ ఫైర్ అవుతుంటాయి. వచ్చిన సమాచారం మేరకు వార్తలు ప్రచురితమవుతుంటాయి. అవి గాలి వార్తలు అని సదరు వ్యక్తుల కొట్టిపారేయడమో.. లేక నిజమేనని ఒప్పుకోవడమో.. లేదంటే ఏమీ తెలియనట్టు సైలెంట్‌గా ఉండిపోవడమో చేస్తారు. కొందరు అలాంటి వార్తలను సీరియస్ తీసుకుని ఫైర్ అవుతుంటారు. ఓ ప్రముఖ నటుడు సన్నీలియోన్ నంబర్ అడిగాడని, కానీ ఆమె తిరస్కరించిందనే వార్తలు వైరల్ అయ్యాయి. వీటిపై సదరు నటుడు, సన్నీ లియోన్ భర్త ఫైర్ అయ్యాడు. అసలు ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

డబూ రత్నానీ క్యాలెండర్ ఫోటో షూట్..

డబూ రత్నానీ క్యాలెండర్ ఫోటో షూట్..

బాలీవుడ్ ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబూ రత్నానీ క్యాలెండర్‌పై ఈ ఏడాది సన్ని లియోన్ హాట్‌గా కనిపించబోతోంది. ఈ ఫోటో షూట్ జరుగుతున్న సమయంలో సీనియర్ బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ కూడా ఉన్నారట. ఫొటో షూట్ అనంతరం సన్నీని ఫోన్ నెంబర్ అడిగారట కబీర్ బేడీ. సినీ ఇండస్ట్రీలో కబీర్ బేడీ ఓ సీనియర్ నటుడు కాబట్టి.. నెంబర్ ఇవ్వనంటే ఫీల్ అవుతాడేమో అని భావించి, తన నెంబర్‌కి బదులుగా తన భర్త డేనియల్ వెబర్ నెంబర్ ఇచ్చేసిందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

సన్నీని నెంబర్ అడిగిన నటుడు..

సన్నీ లియోన్‌ను నంబర్ అడిగిన సీనియర్ నటుడు అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయ. ఈ వార్తలు అక్కడా ఇక్కడా పాకుతూ చివరకు కబీర్ బేడీ, సన్నీ లియోన్ భర్త డానియల్ వెబర్ ఫైర్ అయ్యారు. తప్పుడు వార్తలు రాసినవారంత క్షమాపణలు చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 స్పందించిన కబీర్ బేడి..

స్పందించిన కబీర్ బేడి..

సన్నీ లియోన్, తనకు సంబంధించిన వార్తలు హల్ చల్ చేయడంతో స్వయంగా రంగంలోకి దిగాడు సీనియర్ నటుడు కబీర్ బేడీ. ఆ వార్తల్లో నిజం లేదు. సన్నీ లియోన్‌ను ఆమె భర్త నంబర్ ఇవ్వమని అడిగాను.. ఆమె ఇచ్చింది.. ఆయన నా ఫోన్‌లోకి వచ్చాడు.. ఇలాంటి వార్తలు రాయడం సిగ్గు చేటు.. ఈ వార్తను వెంటనే తొలగించండని సదరు మీడియా సంస్థకు వార్నింగ్ ఇచ్చాడు.

కౌంటర్ వేసిన సన్నీలియోన్ భర్త..

సన్నీ లియోన్-కబీర్ బేడీలపై వచ్చిన వార్తలపై సన్నీ లియోన్ భర్త డానియల్ వెబర్ స్పందిస్తూ.. హాహాహా అతను నా నంబర్ అడగకూడదా..? సన్నీ లియోన్ నంబర్ ఆయన దగ్గర ఎప్పటి నుంచో ఉంది.. ఎందుకంటే వారిద్దరికీ ఎప్పటి నుంచో పరిచయముంది.. ఇలాంటి చెత్త వార్తలను రాయాల్సిన పని లేదంటూ కౌంటర్ వేసినట్టుగా ట్వీట్ చేశాడు.

Recommended Video

Sunny Leone Tears Up As She Remembers Her Team Member || Filmibeat Telugu
 ఇలాంటి జర్నలిజం సిగ్గు చేటు..

ఇలాంటి జర్నలిజం సిగ్గు చేటు..

డానియల్ వెబర్ ట్వీట్‌కు స్పందిస్తూ.. థ్యాంక్స్ డానియల్ చెప్పినందుకు.. ఇలాంటి మీడియాను చూస్తే సిగ్గు చేటుగా ఉండటమే కాదు బాధగా కూడా ఉందని రాసుకొచ్చాడు. మొత్తానికి సన్నీలియోన్-కబీర్ బేడీ వ్యవహారం దుమారం లేపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X