twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘83’కి సంబంధించి వంద కథలున్నాయ్.. అందులోంచి కొన్నింటిని మాత్రమే.. డైరెక్టర్ కామెంట్స్

    |

    జరిగింది ఒకటే సంఘటన కావచ్చు.. అక్కడి నుంచి చరిత్ర మొదలైంది. ఆ ఘటనను చూసే విధానంలో ఎన్నో కోణాలుంటాయ్. ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు. ఇదంతా దేని గురించి అని అనుకుంటున్నారా? భారత చరిత్రలో సువర్ణాధ్యయంగా లిఖించబడిన సంవత్సరం 1983. ఎందుకు? ఆ ఏడాది అంత ప్రత్యేకమని ఏ భారతీయుడూ ప్రశ్నించడు. కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు క్రికెట్‌లో విశ్వ విజేతగా నిలిచిన ఏడాదిని భారతీయులెప్పటికీ మరచిపోలేరు. అలాంటి మధురమైన ఘట్టాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతోన్నారు.

    వెండితెరపై 83గా..

    వెండితెరపై 83గా..

    కపిల్ దేవ్ పాత్రలో రణ్ వీర్ సింగ్ లుక్ ఇప్పటికే అందర్నీ ఆకట్టుకుంది. అన్నీ సక్రమంగా ఉండుంటే.. ఈ పాటికి 83 ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ కరోనా వైరస్ అన్నింటిని తలకిందులు చేసేసింది. తాజాగా ఈ మూవీ విశేషాలను డైరెక్టర్ కబీర్ ఖాన్ వివరించాడు.

    వంద కథలున్నాయ్..

    వంద కథలున్నాయ్..

    1983 వరల్డ్ కప్‌కు సంబంధించిన ప్ర‌యాణంలో తన ద‌గ్గ‌ర 100 క‌థ‌లున్నాయని తెలిపాడు. వాటిలో నుంచి 25 క‌థ‌ల‌ను ఆధారంగా చేసుకుని 83 సినిమాను తెర‌కెక్కించానని పేర్కొన్నాడు. ఈ స్క్రిప్ట్‌ను త‌యారు చేయ‌డానికి ఏడాదిన్న‌ర స‌మ‌యం పట్టిందని, ఇందులో చాలా లేయ‌ర్స్ ఉన్నాయని అన్నాడు.

    ఆట ముగియగానే వెకేషన్స్‌కు..

    ఆట ముగియగానే వెకేషన్స్‌కు..

    కేవ‌లం ఆట‌గాళ్ల కోణంలోనే కాకుండా కామెంటేట‌ర్స్‌, ప్రేక్ష‌కుల కోణంలోనూ సాగుతుందని చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్ స‌హా మ‌రో ఆరుగురు ఆట‌గాళ్లు గ్రూపు మ్యాచ్‌లు ముగియ‌గానే వెకేష‌న్స్ బ‌య‌లుదేరాల‌ని అనుకున్నారని తెలిపాడు. ఆ ఏడుగురు ఆట‌గాళ్లు ముంబై నుండి న్యూయార్క్‌కి వ‌యా లండ‌న్ మీదుగా టికెట్స్‌ను బుక్ చేసుకున్నారని పేర్కొన్నాడు. శ్రీకాంత్‌గారు స‌హా చాలా మంది ఆట‌గాళ్ల‌కి గ్రూపు మ్యాచ్‌ల‌ను దాటుతామ‌నే న‌మ్మ‌కం లేదని అన్నాడు.

    ప్రముఖ సంస్థలు..

    ప్రముఖ సంస్థలు..

    రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఫాంటమ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో క‌బీర్‌ఖాన్ ఫిలిమ్స్ ప్రొడ‌క్ష‌న్ ప‌తాకంపై దీపికా ప‌దుకొనె క‌బీర్‌కాన్‌, విష్ణు ఇందూరి, సాజిద్ న‌డియ‌డ్ వాలా, ఫాంట‌మ్ ఫిలిమ్స్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రం కోసం కపిల్ దేవ వద్ద రణ్ వీర్ కొన్ని సూచనలతో పాటు శిక్షణ కూడా తీసుకున్నాడు.

    English summary
    Kabir Khan About Ranveer Singh 83 Movie. He Saya That I had 100 fantastic stories and I could pick only 25 from the mountain of material I had with me. That’s the reason it took me close to a year-and-a-half to finalise the script.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X