సర్ జీ అని పిలవలేదని సినిమాలోంచి పీకేశారట.. అమితాబ్ అసలు నిజ స్వరూపమిదే!!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత పరిస్థితులు చాలా మారిపోయాయ్. బాలీవుడ్‌పై ఎన్నడూ లేనటువంటి విమర్శలను ఎదుర్కొంటోంది. ఎప్పటినుంచో కూరుకుపోయి ఉన్న నెపోటిజంపై గత నెల రోజులుగా చర్చ జరుగుతూనే వస్తోంది. సుశాంత్ మరణాన్ని జీర్ణించుకోలేని నెటిజన్లు, ఆయన ఫ్యాన్స్ నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయాన్ని ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా కంగనా రనౌత్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి.

కంగనా ఫైర్..
సుశాంత్ మరణానికి కారణమైన వారిని ఎందుకు విచారించడం లేదని, మహేష్ భట్, కరణ్ జోహర్, ఆదిత్య చోప్రా, రాజీవ్ మసంద్ వంటి వారిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించింది. ఈ క్రమంలో కంగనా ఏన్నో అంశాలను లేవనెత్తింది. సుశాంత్‌ను ఎలా తొక్కేశారో చెబుతూ సూసైడ్ గ్యాంగ్, బాలీవుడ్ మాఫియా అంటూ ఓ రేంజ్‌లో అందరిపై విరుచుకుపడింది.

వ్యాఖ్యలు వైరల్..
కంగనా లేవనెత్తిన అంశాలు, ఆమె చేసిన కామెంట్లు, వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ట్విట్టర్ మొత్తం కంగనా పేరు ట్రెండ్ అయింది. ఇక కంగనా లేవనెత్తిన అంశాలను నెటిజన్లు గుర్తు చేసుకుంటూ బాలీవుడ్ మాఫియా అనే హ్యాష్ ట్యాగ్‌తో అందరినీ ఎండగట్టారు. అందులో భాగంగా నాటి నటుడు ఖాదర్ ఖాన్ వీడియోను తెగ షేర్ చేశారు.

సర్ జీ అని పిలవలేదని..
ఖాదర్ ఖాన్ గతంలో మాట్లాడిన వీడియోలను నెటిజన్లు ప్రస్తుతం షేర్ చేస్తున్నారు. ఖాదర్ అందులో తనకు ఎదురైన సంఘటనలను వివరించాడు. ఓ సారి అమితాబ్‌ను సర్ జీ అని సంబోధించలేదట. దాంతో మిగతా ప్రాజెక్ట్‌ల నుంచి ఆయన్ను తప్పించారట. అదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.
Recommended Video

నెటిజన్స్ ఫైర్..
అసలే వేడి మీదున్న నెటిజన్స్‌కు ఈ వీడియో కంటపడగానే ఆగ్రహం అంతెత్తున లేచింది. బాలీవుడ్ మాఫియాను బాయ్ కాట్ చేయాలని, ఎవ్వరైనా సరే వారి చిత్రాలను మాత్రమే గౌరవించాలని, వారిని కాదని, సినిమాల్లో వారు పోషించే పాత్రలు వేరు.. నిజ జీవితంలో ఉండేది వేరని కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











