బాలీవుడ్ హీరోతో కాజల్ అగర్వాల్ రొమాన్స్.. ఈ సారి ఇక తాడోపేడో..
దక్షిణాది చిత్ర పరిశ్రమతోపాటు బాలీవుడ్‌లోనూ అవకాశాలు చేజిక్కించుకొంటున్న కాజల్ అగర్వాల్ అందం, అభినయంతో మెప్పిస్తున్నారు. బాలీవుడ్‌లో దే దే ప్యార్ దే సినిమాతో హిట్ చేజిక్కించుకొంటున్న కాజల్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. బాలీవుడ్ హీరోలు జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మీతో రూపొందించే ముంబై సాగా చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా తెరకెక్కించే ఈ చిత్రం ఆగస్టు 27వ తేదీన సెట్స్‌పైకి వెళ్లింది. ఈ చిత్రంలో కాజల్ పాత్ర గురించి ఎంత గొప్పగా చెప్పారో మీరే చూడండి..

గ్యాంగ్‌స్టర్ సినిమాలో
ముంబై సాగా చిత్రం గ్యాంగ్‌స్టర్ కథా నేపథ్యంతో తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్, గుల్షన్ గ్రోవర్, అమోల్ గుప్తా, రోహిత్ రాయ్ తదితరులు నటిస్తున్నారు. 80, 90 దశకాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంతో కథ, కథనాలు ఉంటాయని దర్శకుడు సంజయ్ గుప్తా మీడియాకు వెల్లడించారు.

కాజల్ పాత్ర స్ట్రాంగ్‌గా
ముంబై సాగా సినిమా గురించి సంజయ్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. నేను రూపొందించే గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో పాత్రలు బలంగా ఉంటాయి. ప్రధానంగా హీరోయిన్ పాత్రలు మరింత స్ట్రాంగ్‌గా డిజైన్ చేస్తాను. ఈ చిత్రంలో కాజల్ బలమైన హీరోయిన్ పాత్రను పోషిస్తున్నది. జాన్ అబ్రహానికి ప్రియురాలిగా, భార్యగా రెండు వేరియేషన్స్ ఉండే పాత్రలో కాజల్ కనిపిస్తారు అని చెప్పారు.

పలు రకాల వేరియేషన్స్‌తో
ముంబై సాగాలో కాజల్ అగర్వాల్ 17 ఏళ్ల అమ్మాయిగా, కాలేజ్ గర్ల్‌గా, వయసులో ఉన్న వివాహితగా, 30 ఏళ్ల వయసుతో మనోధైర్యం ఉండే మహిళగా కనిపిస్తారు. నాకు కాజల్ టాలెంట్ చూస్తే ముచ్చటేస్తుంది. అద్భుతంగా తెర మీద కనిపిస్తుంది. అలాగే గొప్ప స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుంది. అలాంటి పాత్రకు కాజల్‌ను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని భావిస్తున్నాను. జాన్ అబ్రహంతో జతకడుతుంది. ఇమ్రాన్ హష్మీకి హీరోయిన్ ఉండదు అని సంజయ్ గుప్తా తెలిపారు.

రియల్ ఎస్టేట్ మాఫియాతో
ముంబై సాగా విషయానికి వస్తే.. 1980 నుంచి 90 వరకు చేనేత మిల్లులను మూసివేసే రియల్ ఎస్టేట్ మాఫియా కథా నేపథ్యంతో సాగుతుంది. మాల్స్, ఆకాశహార్య్యాలు నిర్మించేందుకు చేనేత మిల్లులను మూసివేయడంపై జరిగే సంఘర్షణ, పోరాటం ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఈ చిత్రాన్ని 2020 జూన్ 19న రిలీజ్ చేస్తాం అని సంజయ్ గుప్తా తెలిపారు.


Click it and Unblock the Notifications











