ఆ హీరో మీద ఆమెకు క్రష్, నన్ను ఘోరంగా అవమానించింది: కాజోల్ గురించి కరణ్ జోహార్

Recommended Video

Karan Johar Reveals Kajol Had A Crush On Akshay Kumar || Filmibeat Telugu

బాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్, కరణ్ జోహార్ బెస్ట్ ఫ్రెండ్స్. వీరి మధ్య టీనేజ్ నుంచే స్నేహం ఉంది. ఒకరికి సంబంధించిన సీక్రెట్స్ మరొరికి తెలుసు. తాజాగా ఓ చాట్ షోలో పాల్గొన్న ఈ ఇద్దరూ సీక్రెట్స్ బయట పెట్టుకున్నారు. కాజోల్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని కొన్ని విషయాలు కరణ్ లీక్ చేశారు.

ఈ సందర్భంగా కరణ్ జోహార్ గురించిన విషయాలు, చిన్న తనంలో తమ మధ్య జరిగిన కొన్ని ఫన్నీ సంఘటనల గురించి కాజోల్ బయట పెట్టారు. ఒకప్పుడు కాజోల్ వల్ల తాను ఘోరమైన అవమానికి గురైన విషయాన్ని ఈ సందర్భంగా కరణ్ గుర్తు చేసుకున్నారు.

అక్షయ్ కుమార్ మీద కాజోల్ క్రష్

అక్షయ్ కుమార్ మీద కాజోల్ క్రష్

‘ఓసారి కాజోల్‌ను పార్టీలో కలిశాను. హెన్నా మూవీ ప్రీమియర్ సందర్భంగా ఆ పార్టీ జరిగింది. అప్పుడు అక్షయ్ కుమార్ మీద కాజోల్‌కు చాలా క్రష్ ఉండేది. మొత్తం ప్రీమియర్ అయ్యే వరకు ఆమె అతడిని చూస్తూనే ఉంది. నేను సపోర్టుగా ఉన్నాను. ఆ ఈవెంట్ అయ్యేంత వరకు ఇద్దరం అక్షయ్‌ను చూస్తూనే ఉండిపోయాం. కానీ మేము అక్షయ్‌ను పట్టుకోలేక పోయాం. అ సమయంలోనే మా ఇద్దరి మధ్య ప్రెండ్షిప్ మొదలైంది. ఇద్దరి నివాసం కూడా సౌత్ ముంబైలోనే కావడంతో స్నేహం మరింత బలపడింది' అని కరణ్ జోహార్ తెలిపారు.

ఆయన డ్రెస్ చూసి నవ్వు ఆగలేదు

ఆయన డ్రెస్ చూసి నవ్వు ఆగలేదు

కరణ్, తాము మొదట కలిసినపుడు జరిగిన సంఘటన గురించి ఈ సందర్భంగా కాజోల్ ప్రస్తావించారు. ‘డిస్కో‌థెక్‌లో జరుగుతున్న ఫిల్మ్ పార్టీలో నేను ఉన్నాను. ఆపుడు కరణ్ జోహార్ 3 పీస్ సూట్లో వచ్చాడు. ఆయన్ని అలా చూసినపుడు నాకు నవ్వు ఆగలేదు, ఆయన అలాంటి డ్రెస్ ధరించడం చూసి ఆశ్చర్యపోయాను' అన్నారు.

ఘోరంగా అవమానించింది

ఘోరంగా అవమానించింది

‘అపుడు నా వయసు కేవలం 17 సంవత్సరాలు. ఫిల్మ్ పార్టీ కాబట్టి అందరూ అలాగే వస్తారని నేను సూట్ వేసుకుని వెళ్లాను. తనూజా ఆంటీ(కాజోల్ తల్లి) మమ్మల్ని డాన్స్ చేయమని సూచించింది. నేను నా డాన్స్ చేస్తుంటే కాజోల్ నన్ను చూసి నవ్వడం ప్రారంభించింది. దాదాపు అరగంట నవ్వుతూనే ఉంది. దాన్ని నేను చాలా అవమానంగా ఫీలయ్యాను. అక్కడి నుంచి వెళ్లిపోయాను. నా జీవితంలో అంత అవమానం ఎప్పుడూ ఫేస్ చేయలేదు' అని కరణ్ జోహార్ తెలిపారు.

నాకు వేరే పేరు పెట్టాలనుకున్నారు

నాకు వేరే పేరు పెట్టాలనుకున్నారు

ఈ సందర్భంగా కాజోల్ మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. ముందు తనకు ఇంట్లో వారు కాజోల్ అని కాకుండా మెర్సడెస్ అనే పేరు పెట్టాలనుకున్నట్లు తెలిపారు. ‘మా నాన్న మెర్సడెస్ అనే పేరు పెట్టాలనుకున్నారు. ఒక పర్సన్ తన కూతురురికి పేరు మీద కంపెనీ మొదలు పెట్టినపుడు... నేను ఎందుకు అలా చేయకూడదు అని ఆలోచించారు' అని గుర్తు చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X