ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్: ఊహించని పాత్రలో నటిస్తుందని అంటున్నారే
బాలీవుడ్ బడా డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. వీఎఫ్ఎక్స్ వండర్‌గా రూపొందనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా గురించి రోజుకో వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ న్యూస్ వైరల్ అయింది.
పొట్టి బట్టలతో టాలీవుడ్ పాపులర్ యాంకర్ ఫోటోషూట్ (ఫొటోలు)
'ఆదిపురుష్'లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హేమ మాలినీ కూడా నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ బీ టౌన్ ఏరియాలో తెగ చక్కర్లు కొట్టింది. అంతేకాదు, ఆమె ఈ సినిమాలో చేసేది ప్రభాస్ (రాముడి పిన తల్లి కైకేయి) తల్లి పాత్ర అని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో ఈ పాత్రకు మరో నటి పేరు తెరపైకి వచ్చింది. ఆమెనే సీనియర్ హీరోయిన్ కాజోల్. అవును.. ఇందులో ఈ గ్లామరస్ నటీమణి సందడి చేయబోతుందనే టాక్ బాగా వినిపిస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
హాట్ హాట్ అందాలతో సెగలు రేపుతున్న ముదురు భామ తనుశ్రీ (ఫొటోలు)

రామాయణంలో ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్'లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగానూ.. రావణుడిగా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అలాగే, ఇందులో సీతగా టాల్ బ్యూటీ కృతీ సనన్ నటిస్తోంది. యంగ్ హీరో సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. వీళ్లతో పాటు ఈ చిత్రంలో ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











