కళంక్ ఫస్ట్ రివ్యూ: వెండి తెర దృశ్యకావ్యం.. ప్రశంసలతో ముంచెత్తిన సెలిబ్రీటీలు
Recommended Video
బాలీవుడ్‌లో మరో విభిన్నమైన చిత్రం కళంక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో అలియాభట్, వరుణ్ ధావన్, మాధురీ దీక్షిత్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా ప్రీమియర్ ముంబైలో సెలబ్రిటీలకు ప్రదర్శించడం జరిగింది. కరణ్ జోహర్ నిర్మించిన ఈ సినిమాపై నేహా దుపియా, శంశాంక్ ఖైతాన్, మిలాజ్ జవేరి ఇతర సెలబ్రీటీలు ప్రశంసల వర్షం కురిపించారు. కళంక్ సినిమా గురించి ఏం చెప్పారంటే..
ప్రీ ఇండిపెండెన్స్ కథతో మూవీ
కళంక్ చిత్రం స్వాతంత్రానికి పూర్వం ఉండే కథ ఇది. ప్రేమ, పగ, పత్రీకారం నేపథ్యంగా ఆరు పాత్రల నేపథ్యంగా సినిమా సాగుతుంది. అద్భుతమైన సెట్లు, ఆశ్చర్యానికి గురిచేసే సన్నివేశాలు, గొప్పగా రూపొందించిన క్యారెక్టర్లుగా కళంక్ సినిమా కథ సాగుతుంది.
మాధురి దీక్షిత్ అందం, అభినయం
కళంక్ చిత్రంలో ప్రతీ క్యారెక్టర్‌ను అమితంగా ఇష్టం పడ్డాను. రొమాన్స్ చాలా క్లాసిక్‌గా ఉంది. మాధురి దీక్షిత్ అందం, అభినయం, సంజయ్ దత్ పవర్ ఫుల్ రోల్, ఆదిత్య రాయ్ కపూర్, సోనాక్షి సిన్హా, కునాల్ ఖేము పాత్రలు చాలా బలంగా ఉన్నాయి.

కన్నుల పండువగా
కళంక్ చిత్రం తెర మీద కన్నుల పండువగా ఉంది. చాలా అందంగా తెరకెక్కించారు. అద్భుతమైన కథను సినిమాటిక్‌గా రూపొందించారు. మంచి హృదయంతో కూడిన అందమైన ప్రపంచం కనిపిస్తుంది. దర్శకుడు అభిషేక్ వర్మన్ జాబ్ సూపర్. ఆదిత్య రాయ్ కపూర్ నటన సూపర్బ్. సోనాక్షి సిన్హా అతిథి పాత్రలో మెరిసింది అని శంశాక్ ఖైతాన్ తెలిపారు.

అనుభవం ఉన్న దర్శకుడిగా
కళంక్ చారిత్రక నేపథ్యంతో ఉండే అద్భుతమైన కథ. అభినవ్ వర్మన్ గొప్ప అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తెరక్కించారు. అతని విజన్ చాలా గొప్పగా ఉంది. వరుణ్ ధావన్ నటన అద్భుతంగా ఉంది. అలియా భట్ నటన అమోఘం. ఆదిత్య నటన బ్రిలియెంట్. మరోసారి సోనాక్షి సిన్హా ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడం ఖాయం అని మిలాప్ అభిప్రాయపడింది.

22 ఏళ్ల తర్వాత మాధురీ దీక్షిత్, సంజయ్ దత్
బాలీవుడ్ అగ్రతారలు మాధురీ దీక్షిత్, సంజయ్ దత్ కలిసి 22 ఏళ్ల తర్వాత నటించారు. వారిద్దరు కలిసి తెర మీద కనిపించడంతో వారిని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మళ్లీ మాధురి దీక్షిత్‌తో నటించడం ఆనందంగా ఉందని సంజయ్ దత్ చెప్పారు. ఆమెతో మళ్లీ నటించే అవకాశం రావడంతో నెర్వస్‌గా ఫీలయ్యాను. సెట్‌లో ఆమెతో ఉన్న చొరవ వల్ల నటించడం చాలా సులభమైంది అని సంజయ్ దత్ అన్నారు.


Click it and Unblock the Notifications











