twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్‌ మరణంపై షాకింగ్‌గా ఫొరెన్సిక్ రిపోర్టు.. విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో..

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతున్నది. సుశాంత్ సూసైడ్‌పై భిన్న కథనాలు మీడియాలో వినిపిస్తున్నాయి. ఓ వర్గం సుశాంత్‌ది ముమ్మాటికే హత్యే అంటూ ఆరోపిస్తుండగా.. మరోవైపు ముంబై పోలీసులు ఎలాంటి కుట్ర జరుగలేదని స్పష్టం చేస్తున్నారు. తాజాగా సుశాంత్ మరణానికి సంబంధించిన ఫొరెన్సిక్ ఫైనల్ రిపోర్టు పోలీసులకు అందింది. ఈ ఫొరెన్సిక్ రిపోర్టులో ఏమున్నదంటే

    కుదిపేసిన సుశాంత్ మరణం

    కుదిపేసిన సుశాంత్ మరణం


    జూన్ 14వ తేదీన సుశాంత్ సూసైడ్ చేసుకొన్నారనే వార్త దేశవ్యాప్తంగా ఎంతో అభిమానులను కుదిపేసింది. సుశాంత్ మరణం వెనుక కారణాలపై ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు 50 మందికిపైగా సినీ ప్రముఖులను, స్నేహితులను ప్రశ్నించారు. అయితే సుశాంత్ మరణంపై వెలుగు చూస్తున్న వాస్తవాలు సూసైడ్ అనే విషయాన్ని ధృవీకరించలేకపోతున్నాయి.

    విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో

    విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో


    ఫొరెన్సిక్ నిపుణులు అందించిన రిపోర్టు ప్రకారం.. సుశాంత్ మరణంలో ఎలాంటి కుట్రలు జరుగలేదనే విషయం ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైంది. కలినా ఫొరెన్సిక్ ల్యాబ్‌లో సుశాంత్ కడుపులో విష పదార్థాలు ఏవైనా ఉన్నాయా? విషయ ప్రయోగం జరిగిందా? లాంటి అంశాలను పరిశీలించారు. గోళ్లు, తదితర విషయాలను క్షుణ్ణంగా పరీక్షించారు. అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత సుశాంత్ మరణం వెనుక ఎలాంటి కుట్ర జరుగలేదనే విషయాన్ని స్పష్టం చేశారు.

    మరణానికి ముందు పెనుగులాట జరగలేదు

    మరణానికి ముందు పెనుగులాట జరగలేదు


    సుశాంత్‌పై ఎవరూ కూడా విష ప్రయోగం చేయలేదు. స్వయంగా ఆయన విషం తీసుకొలేదు. మరణించిన సమయంలో ఎలాంటి పెనుగులాట జరగలేదు. సూసైడ్ చేసుకొన్నప్పుడు ఆయన నోటి నుంచి నురుగు బట్టలపై పడలేదు. మరణానికి ముందు గొడవ జరిగే కలిగే గాయాలు శరీరంపై లేవు అని ఫోరెన్సిక్ నిపుణుల నివేదికలో తెలిపారు.

    సుప్రీంకోర్టుకు ఫైనల్ ఫొరెన్సిక్ రిపోర్టు

    సుప్రీంకోర్టుకు ఫైనల్ ఫొరెన్సిక్ రిపోర్టు

    ఫొరెన్సిక్ రిపోర్ట్ అందిన తర్వాత ముంబై పోలీసులు మాట్లాడుతూ.. జూలై 13న ఐదుగురు ఉన్నతాధికారులు ఫొరెన్సిక్ నిపుణులను కలిశారు. ఆ తర్వాత 20 రోజుల లోపు వారు రిపోర్టును సమర్పించారు అని తెలిపారు. ముంబైలోని కలినా ఫోరెన్సిక్ ల్యాబ్ సమర్పించిన ఫైనల్ ఫొరెన్సిక్ రిపోర్టును ముంబై పోలీసులకు చేరింది. తాజా ఫొరెన్సిక్ రిపోర్టును ఈ రోజు జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు అందజేశారు.

    Recommended Video

    Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
    రంగంలోకి ఈడీ, సీబీఐ దర్యాప్తు మొదలు

    రంగంలోకి ఈడీ, సీబీఐ దర్యాప్తు మొదలు


    సుశాంత్ సింగ్ రాజ్‌ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన తండ్రి పాట్నాలో కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ, సీబీఐ రంగంలోకి దిగింది. సుశాంత్ సింగ్ బ్యాంక్ అకౌంట్లలో అవకతవకలపై విచారణ జరుపుతూ రియా చక్రవర్తి కుటుంబాన్ని సోమవారం విచారించగా, స్నేహితుడు సిద్దార్థ పితాని, సుశాంత్ సోదరి మితూ సింగ్‌ను ఆగస్టు 11న విచారించింది.

    English summary
    Kalina Forensic Lab submitted Sushant Singh Rajput death's forensic reports. After death on June 14th, Kalina Forensic Lab examines toxicology, litigation mark, nail sampling, stomach wash things. They said, No foul play in the sushant case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X