twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యభిచారి అని అన్నారు.. ఆ నిర్మాత డేట్‌కు పిలిచాడు.. నటి షాకింగ్ కామెంట్స్

    |

    దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ నుంచి విడిపోయిన అనంతరం ఫ్రెంచి అమ్మాయి కల్కి కొచ్లిన్ వార్తల్లోకెక్కింది. బ్రేకప్ తరువాత కొన్నాళ్లకు గయ్ హెర్ష్ బర్గ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. రెండేళ్లుగా అతడితో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆ క్రమంలోనే బేబి బంప్ ని ప్రదర్శిస్తూ పలు మ్యాగజైన్లు.. మీడియాలకు కల్కి ఇంటర్వ్యూలు ఇస్తోంది.

    బేబీ బంప్‌తో ఫోటోలు హల్ చల్..

    బేబీ బంప్‌తో ఫోటోలు హల్ చల్..

    ఈ మధ్య హీరోయిన్లు బేబీ బంప్ ఫోటో షూట్ల ట్రెండ్‌ను మొదలు పెట్టారు. అమీ జాక్సన్, సమీరా రెడ్డి లాంటి వారు బేబీ బంప్‌తో చేసిన ఫోటో షూట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ కల్కి కొచ్లిన్ చేసిన బేబీ బంప్ ఫోటో షూట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    గతం గురించి వివరాలు..

    గతం గురించి వివరాలు..

    బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ మ్యాగజైన్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె గతానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఫ్రెంచ్ పేరెంట్స్‌కు పాండిచ్చేరి(ఇండియా)లో జన్మించానని, . తాను హిందీ పూర్తిగా మాట్లాడగలనని తెలిపింది

    వ్యభిచారి అని..

    వ్యభిచారి అని..

    కానీ తనని ఓ రష్యన్ అని ముంబై మీడియా భావించేదంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకుంది. అంతేకాదు ఓ పత్రికలో రష్యన్ వ్యభిచారి అని కూడా రాశారని చెప్పుకొచ్చింది. కెరీర్ ఆరంభంలో ఇలాంటి అవమానాలెన్నో ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా నాటి సంగతులను రిమైండ్ చేసుకుంది.

    డేట్‌కు పిలిచిన నిర్మాత..

    డేట్‌కు పిలిచిన నిర్మాత..

    మీడియా వాళ్లు పరిశ్రమలో ఉన్న వ్యక్తుల్ని నిర్ణయించేస్తారు. అందుకే కెరీర్ ప్రారంభంలో ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చిందని కల్కి తెలిపింది. అప్పట్లోనే ఓ నిర్మాత తనని డేట్ కి పిలిచాడనీ, మీటూ ప్రాబ్లెమ్‌ని ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. అయితే తాను ఆ నిర్మాత ప్రపోజల్ కి స్పందించకపోవడంతో అటుపై ఛాన్స్ కోల్పోవాల్సి వచ్చిందని కల్కి తెలిపింది. 2013లో రణ్‌బీర్‌ కపూర్‌, దీపికా పదుకొణెతో కలిసి ‘యే జవానీ హై దివానీ' వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలో నటించినప్పటికీ అవకాశాలు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.

    English summary
    Kalki Koechlin Comments On Calling Her Prostitute And Me Too. I have literally had eight nine months of no work coming to me. That too after Yeh Jawaani Hai Deewani
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X